Advertisement
రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు జోరుగా కురుస్తున్నాయి. అటు ఏపీలో ఇటు తెలంగాణలో కూడా వానలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో నిరాశ్రులయ్యారు. అలాంటి వాళ్ళందరికీ సహాయక చర్యలు చేపట్టాయి ప్రభుత్వాలు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అలెర్ట్ చేస్తూ కీలక ఆదేశాలని జారీ చేశారు. చంద్రబాబు నాయుడు వరద బాధితులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నేటి నుంచి ప్రత్యేకంగా కిట్లు పంపిణీ చేయబోతోంది.
Advertisement
విజయవాడలో వరద బాధిత కుటుంబాలకు నిత్యవసరాల కిట్స్ తో పాటుగా రాయితీపై కూరగాయలని అందిస్తున్నారు, ఈ కిట్లతో ప్రజలకు మేలు కలగబోతోంది. 25 కిలోల బియ్యం, లీటర్ పామ్ ఆయిల్, రెండు కిలోల బంగాళదుంపలు, ఒక కిలో కందిపప్పు, రెండు కిలోల ఉల్లిగడ్డలు, ఒక కిలో చక్కెర ఇస్తున్నారు. తొలివిడతగా 50,000 కుటుంబాలకి సహాయం అందించబోతున్నారు, మొత్తం 2 లక్షల 50వేల నిత్యావసరకి ఇట్లా పంపిణీ చేయాలని ప్రభుత్వం చూస్తోంది.
Advertisement
Also read:
సహాయక చర్యలు వేగవంతం చేసిన సర్కార్ పెద్ద ఎత్తున అధికారి యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. అలాగే మొబైల్ మార్కెట్ల ద్వారా కూరగాయల్ని వరద బాధితులకి అందించాలని.. అన్ని రకాల కూర ఆకుకూరలు రెండు నుంచి 20 లోపు ధర ఫిక్స్ చేశారు అన్ని కూరగాయల్ని ఐదు రూపాయలుగా అదేవిధంగా 20 పైన ఉండే కూరగాయల్ని 10 చొప్పున విక్రయిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి ఒక్క కుటుంబానికి ఐదు లక్షల అధిక సహాయాన్ని అందించాలని అధికారులకు సూచించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!