Advertisement
T20 వరల్డ్ కప్ తర్వాత భారత్ కి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. శ్రీలంకపై సిరీస్ గెలిచిన టీమిండియా వన్డే సిరీస్ 0-2 తో కోల్పోయింది. తర్వాత కాస్త విరామం తీసుకున్న భారత్ మరో సిరీస్ కు సిద్ధమైంది. సెప్టెంబర్ 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ ఆడబోతోంది. తొలి మ్యాచ్ చెన్నై వేదికగా జరగబోతోంది. భారత్ కి బంగ్లాదేశ్ కఠిన ప్రతి కానప్పటికీ స్పిన్ కి అనుకూలించే చెపాక్ వేదికగా మొదటి టెస్ట్ జరుగుతుండడంతో టీం ఇండియా మేనేజ్మెంట్ తుది జట్టు ఎంపికలో జాగ్రత్త వహిస్తుంది.
Advertisement
లంక చేతిలో ఓటమికి కారణం ప్రత్యర్థి స్పిన్నర్లను మన బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం. అలాగే పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ గెలిచిన కొత్త ఉత్సాహంతో బంగ్లా బరిలోకి దిగనుంది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ తిరిగి భారత జట్లు లోకి రావడంతో తుది జట్టులో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
Advertisement
Also read:
ఇంగ్లాండ్ సిరీస్లో ఆకట్టుకున్న సర్ఫరాజ్ బెంచ్ కి పరిమితం కావాల్సి ఉంది. ఇక తొలిసారి టీమిండియాకు ఎంపికైన దయాల్ అరంగ్రేటం కోసం ఎదురు చూడాల్సి ఉంది. కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ కి ఇప్పుడు జట్లలో మార్పు తలనొప్పిగా మారింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా జట్టులో ఉండడం ఖాయం.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!