Advertisement
తమిళ, తెలుగు సినిమాల్లో మంచి పాత్రలు చేసి గుర్తింపు పొందిన యాక్టర్ రఘువరన్. నాని మూవీలో సైంటిస్ట్ క్యారెక్టర్ లోఎంతో మంచి యాక్టింగ్ చేశారు. అంతేకాక మాస్, అనగనగా ఒక రోజు లాంటి ఎన్నో సినిమాల్లో రఘువరన్ మంచి పాత్రలు పోషించారు మరియు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఈయన ఒక కేరళ నటుడు అయినా సరే యాక్టింగ్ స్టైల్, వాయిస్ మోడ్యుకేషన్ తో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. 1996లో రఘువరన్ నటి రోహిణి ని పెళ్లి చేసుకున్నాడు. రోహిణి కూడా ఎంతో టాలెంటెడ్ అని చెప్పవచ్చు. ఆమె ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును కూడా పొందడం జరిగింది. భక్తకన్నప్ప, మగమహారాజు, స్త్రీ, బాహుబలి, రంగస్థలం, ఇష్క్, రైటర్ పద్మభూషణ్ వంటి సినిమాలలో మంచి పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు.
Advertisement
ప్రస్తుతం కూడా ఈమె ఒక బిజీ యాక్టర్ గా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. రఘువరన్ తో రోహిణి పెళ్లి చేసుకున్న తర్వాత ప్రవర్తనలో చాలా మార్పుని గమనించడం జరిగింది. పెళ్లికి ముందు రఘువరన్ ఎంతో కూల్ గా ఉండేవారని కానీ పెళ్లయిన కొద్ది రోజుల్లోనే చాలా మార్పును గమనించి ఈమే భయపడ్డారు.
Advertisement
Also read:
ఆ విషయాలలో పూర్తిగా మారిపోయిన శేఖర్ కమ్ముల.. కుబేరతో తో సంచలనాన్ని సృష్టిస్తాడా..?
దాంతో ఎంతో బాధపడి రఘువరన్ తల్లికి తెలియజేసింది. రఘువరన్ తల్లి అప్పుడు తను చేయబోయే క్యారెక్టర్ గురించి తెలుసుకో అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పడం జరిగింది. ఆ సమయంలో రఘువరన్ ఒక సీరియస్ రోల్ లో నటించబోతున్నారు అందుకే షూటింగ్ కి వెళ్లే ముందు ఆ పాత్రలో ప్రవేశించడానికి ఈ విధంగా ప్రవర్తించాడు అని తెలుసుకుంది. ఇలా తెలిసిన తర్వాత ఎంతో ఆశ్చర్యానికి గురైంది. 2004లో రోహిణి రఘువరన్ తో డివోర్స్ తీసుకున్నారు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన 2008లో రఘువరన్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!