Advertisement
నాగార్జున ద్విపత్రాభినయంగా ‘హలో బ్రదర్’ సినిమాని ప్లాన్ చేశారు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. కథ బాగా వచ్చింది. తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడానికి నాగార్జున కూడా ఆసక్తి చూపించాడు. ఇక నాగార్జున సరసన ఒక హీరోయిన్ గా సౌందర్య ను ఫైనల్ చేశారు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి సినిమా ఇదే. అన్నపూర్ణ స్టూడియోలో ‘ప్రియరాగాలే’ పాట చిత్రీకరణతో ఈ ‘హలో బ్రదర్’ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సాంగ్ షూట్ సమయంలోనే మొదటిసారి సౌందర్య, నాగార్జున కలుసుకున్నారు. ఆమె నటన చూసి నువ్వు గొప్ప నటిగా పేరు తెచ్చుకుంటావు అని అప్పుడే చెప్పాడట నాగార్జున.
Advertisement
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
నాగార్జునకు మంచి జడ్జిమెంట్ ఉంది. టాలెంట్ ను బాగా గుర్తించగలడు. ఇక ‘హలో బ్రదర్’ విషయానికి వస్తే, రెండు పాత్రల్లో ఒక పాత్ర చిన్న సైజు దొంగ. మరో పాత్ర పాప్ సింగర్ పాత్ర. రెండు పాత్రల్లో నాగార్జున అద్భుతంగా నటించారు. అయితే, కొన్ని సన్నివేశాల్లో ఈ రెండు పాత్రలు ఒకే ఫ్రేమ్ లో కనిపించాల్సి ఉంది. కాబట్టి, నాగార్జున కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే బాడీ కావాలి. హీరో శ్రీకాంత్ అయితే బాగుంటాడు. హీరోగా చేస్తున్నాడు. నాగార్జునకు డూప్ గా చేస్తాడా? ఈవివి మొహమాట పడుతూనే వెళ్లి శ్రీకాంత్ కి విషయం చెప్పారు.
Advertisement
శ్రీకాంత్ చేస్తాను అని నాగార్జున కి డూప్ గా నటించాడు. అలా ‘హలో బ్రదర్’ సినిమా మొదలైంది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఈవీవీ పూర్తి వినోద భరితంగా తీర్చిదిద్దారు. పైగా నాగార్జున చేత మొదటిసారి పూర్తిస్థాయి కామెడీ పాత్రను పోషించేలా చేశారు. అయితే ఈ చిత్ర విజయం పై ఎందుకో నాగార్జునకు మొదటి నుంచి నమ్మకం లేదు. సినిమా విజయం సాధించదని, బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం ఖాయం అని నాగార్జున బలంగా నమ్మారు. అందుకే ఈయన ఈ సినిమాను సీరియస్ గా తీసుకోలేదు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ‘హలో బ్రదర్’ అద్భుత విజయాన్ని సాధించింది. 1994వ సంవత్సరంలో రిలీజ్ అయిన చిత్రాల్లో ‘హలో బ్రదర్’ టాప్ గ్రాఫర్ గా నిలిచింది.
Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!