Advertisement
హైదరాబాద్ లో హైడ్రా సంచలనాన్ని సృష్టిస్తున్న విషయం మనకి తెలిసిందే. ఆక్రమంగా కట్టిన వారిపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. హైడ్రా దెబ్బకు అక్రమార్కులు వణికిపోతున్నారు. ఎఫ్టిఎల్, బఫర్ జోన్లను పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది చెరువు సమీపంలో ఉన్న వాటిని తిరస్కరించడం జరుగుతోంది. హైడ్రా లో నీటిపారుదుల రెవెన్యూ శాఖలను కూడా భాగస్వామ్యం చేశారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు హైడ్రా ఎవరిని వదిలిపెట్టట్లేదు.
Advertisement
నిర్మాణాలను తొలగించడం పై సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల ఇల్లు కూల్చే ప్రభుత్వం ఇదేం ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి సర్కార్ ని ప్రజలు నిలదీస్తున్నారు. ఇళ్ళని కూల్చి బస్సులు ఫ్రీగా ఇస్తారా అంటూ మహిళలు విమర్శలు చేస్తున్నారు. అయితే కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇళ్ళని కూల్చడం దుర్మార్గమని కొంతమంది అంటున్నారు.
Advertisement
Also read:
Also read:
ఇంటి సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా అధికారులపై సామాన్య ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. అక్రమ నిర్మాణాలు అనే తొలగిస్తుండగా కొంతమంది స్థానికులు హైడ్రా అధికారులపై దాడులు చేయగా ముగ్గురిపై కేసులో నమోదు చేశారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!