Advertisement
ఒక బీఈడీ చదువుకున్న మహిళ వరుడు కావాలంటూ ఒక పోస్ట్ పెట్టింది. అది నెట్టింట వైరల్ అవుతోంది. ఉద్యోగం చేస్తూ ఏడాదికి 1.3 లక్షల ఆమె సంపాదిస్తోంది. ముందు పెళ్లి అయిపోయింది కానీ భర్తతో వివాదాలు ఏర్పడి విడాకులు తీసుకుంది ఇప్పుడు ఆ మహిళ రెండో పెళ్లి చేసుకోవడానికి చూస్తోంది. వరుడు కావాలంటూ ఆన్లైన్లో ప్రకటించింది. కాబోయే వరుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంబీఏ, ఎంఎస్ చేసి కనీసం 30 లక్షల వార్షిక వేతనం కలిగి ఉండాలని ఇండియాలో లేదా యుఎస్ లో లేదా యూరప్ లో పని చేయాలని ఆమె కోరుకుంటోంది.
Advertisement
కాబోయే భర్తలకు ఏడాదికి 30 లక్షల జీతం రావాలని ఆ యువకుడికి తల్లిదండ్రులు ఉండకూడదని.. 3bhk ఇల్లు కావాలని పోస్ట్ లో పేర్కొంది. వరుడు కావాలంటూ ఈమె చేసిన పోస్ట్ ని చూసి అందరూ విపరీతంగా షేర్ చేస్తున్నారు. పెళ్లి చేసుకోవడానికి 30 లక్షలు ఉంటే సరిపోదు అతనికి తల్లిదండ్రులు ఉండకూడదు అతనికి తల్లిదండ్రులు ఉంటే పెళ్లి తర్వాత అతనితో ఉండకూడదు లేదా విడివిడిగా ఉండాలని ఆమె చెప్పింది.
Advertisement
Also read:
ఉండడానికి 3bhk ఇల్లు ఉండాలి. ఇంటి పనులు చేయడానికి ఒక పని మనిషి కూడా ఉండాలి అని రాసింది. ఇలాంటి అర్హతలు ఉన్న వరుడు ఉంటే వెంటనే సంప్రదించాలని ఆమె పేర్కొంది. ఈమె గొంతెమ్మ కోరికలపై ప్రస్తుతం ఆన్లైన్ లో చర్చ మొదలైంది మహిళ విడాకులు తీసుకుంది అయినా పెళ్లి కాని యువకుడి కోసం వెతుకుతోంది పైగా ఇన్ని క్వాలిటీస్ ఉండాలా అని అందరూ షాక్ అవుతున్నారు. విపరీతంగా దీనిపై కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!