Advertisement
దేవర సినిమా గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఓ రేంజ్ లో ఉన్నాయి. టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మాత్రమే కాదు యూట్యూబ్ రికార్డ్స్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అభిమానులు మధ్య లైక్స్ విషయంలో నువ్వా నేనా అనే రేంజ్ పోటీ ఉంది. దేవర చిత్రం ట్రైలర్ కూడా యూట్యూబ్ రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని అనుకున్నారు. కానీ దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ప్రభాస్ సలార్ ట్రైలర్స్ రికార్డ్స్ ని బద్దలు కొట్టలేకపోయింది.
Advertisement
భీమ్లా నాయక్, సలార్ చిత్రాలకు సంబంధించిన థియేటర్లు ట్రైలర్స్ కేవలం మూడు నిమిషాల్లోనే లక్షకు పైగా లైక్స్ సాధించాయి. ఎన్టీఆర్ దేవర చిత్రానికి 9 నిమిషాలకు పైన సమయం పట్టింది. 24 గంటల్లో అయినా ఈ రికార్డ్స్ ని బద్దలు కొడుతుంది ఏమో అనుకుంటే అది కూడా జరగలేదు. భీమ్లా నాయక్, సలార్ చిత్రాలకు వన్ మిలియన్ కి పైగా లైక్స్ సాధించాయి. దేవర మాత్రం తొమ్మిది లక్షల లైక్స్ మాత్రమే సాధించింది. మరో దారుణమైన విషయం ఏంటంటే ఈ చిత్రానికి 24 గంటల్లో కేవలం పది మిలియన్ న్యూస్ మాత్రమే వచ్చాయి.
Advertisement
Also read:
కొరటాల శివ గత చిత్రం ఆచార్య ట్రైలర్ కి 24 గంటల్లో 21 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దేవర చిత్రానికి అందులో సగం కూడా రాలేదు. ఇలా జరగడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మాత్రం డిసప్పాయింట్ అవుతున్నారు. ట్రైలర్ పై ట్రోల్స్ వచ్చినా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ట్రైలర్ కి ఆశించిన స్థాయిలో వ్యూస్ రాకపోవడంతో మనస్థాపానికి గురయ్యారు. మరి సినిమా ఎలా ఆకట్టుకుంటుంది అనేది చూడాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!