Advertisement
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి కోర్టులో ఊరట లభించింది. పాస్ పోర్ట్ రెన్యువల్ కోసం ఆదేశాలు ఇచ్చింది. పాస్ పోర్ట్ రెన్యువల్ చేసే ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జగన్ హైకోర్టుని ఆశ్రయించగా అనుకూలంగా కోర్టు ఆదేశాలను జారీ చేసింది. జగన్ పాస్పోర్ట్ ను మరో 5 ఏళ్లకు గాను రెన్యువల్ చేయాలని ఆదేశించింది. అంతకుముందు విజయవాడ కోర్టు విధించిన 25 వేల పూచికత్తులు చెల్లించాల్సిందేనని పేర్కొంది. దానిని రద్దు చేయడానికి నిరాకరించింది.
Advertisement
వివిధ కేసుల్ని ఎదుర్కొంటున్న జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడంతో ఆయనకు పాస్పోర్ట్ పొందేందుకు పెద్దగా సమస్యలు రాలేదు. దీంతో విదేశీ పర్యటనకు ఆటంకం కలగలేదు. ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత పాస్పోర్ట్ సమస్యలు మళ్లీ వచ్చాయి పాస్పోర్ట్ రెన్యువల్ కోసం నిరభ్యంతర పత్రం జారీ చేయడానికి ఎంపీలు ఎమ్మెల్యేలపై కేసుల ప్రత్యేక కోర్టు విధించిన షరతుల్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు సోమవారం తీర్పుని రిజర్వ్ చేసింది.
Advertisement
Also read:
సెప్టెంబర్ 11న ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు తెలిపింది. సీబీఐ కోర్టు ఐదేళ్లపాటు ఎన్వోసీ ఇచ్చినందున ఏడాది పాటు ఎన్ఓసి ఇవ్వడం తన తమ పరిధికి అతీతం అని పేర్కొంటూ ప్రత్యేక కోర్టు విధించిన షరతుల్ని జగన్ సవాల్ చేశారు. రెగ్యులర్ పాస్పోర్ట్ పొందడానికి కోర్టు ఆదేశాలు రావడంతో జగన్ విదేశీ పర్యటనకు మార్గం సులువు అయింది. సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు యూకే వెళ్ళేందుకు కొన్ని షరతులు లోబడి ఐదేళ్లపాటు పాస్పోర్ట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!