Advertisement
నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. పలు అంశాల గురించి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా దేశ ప్రజలకి ఆరోగ్య సేవలు అందించే విషయం పై మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ గురించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి దాకా ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్య సేవలను అందిస్తోంది ప్రభుత్వం. అయితే వైద్య సదుపాయం 70 ఏళ్లలోపు వాళ్ళకి వర్తించేది.
Advertisement
తాజా నిర్ణయం ప్రకారం 70 ఏళ్ళు పైబడిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్య సేవలు అందించనున్నారు. 70 ఏళ్లు పైబడిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్ సేవలు అందిస్తున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. క్యాబినెట్ నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజెన్లకి లబ్ది చేకూరబోతోంది. వీరంతా ఐదు లక్షలు వరకు ఉచితంగానే చికిత్సను పొందవచ్చు.
Advertisement
Also read:
ఆయుష్మాన్ భారత్ లో వృద్ధుల్ని చేర్చడమే కాకుండా రూ.3,437 కోట్లను కూడా కేటాయించారు. ప్రాజెక్టులకు 12,461 కోట్లను కేటాయిస్తే గ్రామ సడక్ యోజనకు 70 వేల 125 కోట్ల రూపాయలని క్యాబినెట్ కేటాయించింది. పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ పథకానికి కూడా తెలిపింది. పదివేల తొమ్మిది వందల కోట్లను ఇందుకోసం కేటాయించారు. పీఎం బస్సు సేవ పథకానికి 3435 కోట్లను కేటాయించారు. వాహనాలపై సబ్సిడీ కోసం 88,500 ప్రదేశాల్లో చార్జింగ్ స్టేషన్ల కోసం ఉపయోగించునున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!