Advertisement
ఇప్పుడు ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటూ ఫోకస్ పెడుతున్నారు. చాలామంది టాలీవుడ్ టాప్ హీరోలు ఇప్పటికే పలు ప్యాన్ ఇండియా సినిమాలతో అలరించారు. అయితే ఇప్పుడే కాదు ఇదివరకు కూడా ఇలా జరిగింది. 1977లో వచ్చిన అడవి రాముడు సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. అలాగే లవకుశ, మాయాబజార్, గుండమ్మ కథ, రాముడు భీముడు సినిమా లాగా ఈ అడవి రాముడు సినిమా కూడా బుర్రల్లో ఉండిపోయింది.
Advertisement
ఎన్టీఆర్ కి విజయాలు, రికార్డులు కొత్త కాదు. ఎప్పుడైనా రికార్డ్ బ్రేక్ చేస్తూ ఉంటారు. టైటిల్ లో రాముడు పేరుని తగిలించడమే బ్రహ్మాండమైన ఐడియా. ఎన్టీఆర్ నటించిన రాముడు సినిమాలన్నీ కనకవర్షాన్ని కురిపించాయని చెప్పొచ్చు. ఆ సినిమా అంత విజయాన్ని అందుకోవడానికి కారణం వేటూరి సుందర రామమూర్తి, కె.వి.మహదేవన్లు. అన్ని పాటలు కూడా వేటూరి రాశారు. సంగీత పరంగా పాటలన్నీ కూడా ఆణిముత్యాలని చెప్పొచ్చు. ఏకలవ్యుడు గురించి వాల్మీకి గురించి శబరి గురించి వర్ణించడం మామూలుగా లేదు.
Advertisement
Also read:
అలాగే సినిమాలో పాటలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా 32 సెంటర్లలో వంద రోజులు, 16 సెంటర్లలో 25 వారాలు, ఎనిమిది సెంటర్లలో 200 రోజులు ఆడింది. వందరోజుల ఫంక్షన్ విజయవాడ అప్సర థియేటర్ లో జరిగింది. 200 రోజుల ఫంక్షన్ మద్రాసు తాజ్ కోరమండల్ హోటల్లో జరిగింది. రాజ్ కపూర్ ముఖ్యఅతిథిగా వచ్చారు. విజయవాడ ఆక్స్ టైలర్స్ గురించి మూవీ గురించి చెప్పుకునేటప్పుడు ప్రత్యేకించి చెప్పుకోవాలి. అతను ఎన్టీఆర్ వీరాభిమాని. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ లో మార్పులు వచ్చాయి. పెద్ద పెద్ద కాలర్లు, ఎలిఫెంట్ బాటమ్ ప్యాంట్లు పాపులర్ అయ్యాయి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!