Advertisement
నగరిలో రోజా దూకుడు రాజకీయాల్ని చేయనున్నారని తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత నిన్న మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉన్నారు. రోజా జగన్మోహన్ రెడ్డిని కలిసి తాను పార్టీలోనే కొనసాగుతున్నానని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. మొన్నటి వరకు పార్టీకి గుడ్ బై కి చెప్పి తమిళనాడులోని విజయ్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లా వైసీపీ నేతల సమక్షంలో పాల్గొన్నారు. నగరి నియోజకవర్గానికి చెందిన వైసిపి నేతలు కేజే కుమార్ ని ఆయన సతీమణి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతిలను తాజాగా పార్టీ నుంచి తొలగిస్తూ ప్రకటన చేశారు.
Advertisement
Advertisement
చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ భరత్ ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నగరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కుమార్ మాజీ ఈడిగా కార్పొరేషన్ చైర్పర్సన్ కేజే శాంతిల పైన పార్టీ సిద్ధాంతాలకు పార్టీ ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని ఫిర్యాదు వచ్చిందట.
Also read:
దీనిపైన క్రమశిక్షణ కమిటీ విచారణ జరపగా అవి వాస్తవం అని పేర్కొన్నారు. ఇది వరకు ఎన్నికల్లో రోజా ఓటమికి వేరే కారణమని రోజా పైన బహిరంగంగానే ఎప్పటికప్పుడు వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ పేరుకి డామేజ్ చేశారని రోజా జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ చర్యతో రోజా అనుకున్నది చేసింది.
తెలుగు న్యూస్ కోసం ఎదురు చూడండి!