Advertisement
కనీసం నటుడుగా గుర్తింపు రాకముందు అల్లు రామలింగయ్య చిరంజీవి అల్లుడు చేసుకున్నారు. సురేఖ మెడలో తాళి కట్టే నాటికి చిరంజీవికి స్టార్డం లేదు. 1978లో విడుదలైన ప్రాణం ఖరీదు సినిమాతో నటుడుగా మారారు చిరు. చిరంజీవిలోని టాలెంట్ గమనించిన అల్లు రామలింగయ్య అతన్ని అల్లుడు చేసుకోవాలనుకున్నారు. ఎప్పటికైనా హీరో అవుతారని మంచి హీరోగా పేరు తెచ్చుకుంటారని ఆయన నమ్మారు. అప్పటికే అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. డబ్బు, హోదా, స్టేటస్ లో అల్లు రామలింగయ్య టాప్ లో ఉన్నారు.
Advertisement
కానీ అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న చిరంజీవిని తన కూతురికి ఇచ్చి పెళ్లి చేశారు అల్లు రామలింగయ్య కి ఎక్కడో ఒక సందేహం ఉంది. నేను చేస్తున్న పని కరెక్టేనా చిన్న పీకులాట ఉంది. మరోవైపు సురేఖకు గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయి. ఆ టైంలో సురేఖకు కలెక్టర్ సంబంధం వచ్చిందట. నటుడు చిరంజీవికి ఇవ్వాలా లేదంటే సెటిల్ పొజిషన్లో ఉన్న కలెక్టర్ కి ఇవ్వాలా అనే సందేహంలో పడ్డారట అప్పుడు ఆయన నటుడు ప్రభాకర్ రెడ్డిని కలిసారు.
Advertisement
Also read:
సురేఖ పెళ్లి విషయం ఆయన సలహాని కోరారు. అల్లు రామలింగయ్య చెప్పిన దానికి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పెళ్లి విషయంలో అమ్మాయి ఇష్టం అనేది చాలా ముఖ్యం ఆడపిల్లకు ఇష్టం లేకుండా ఎంత గొప్ప ఇంటికి పంపించినా సంతోషంగా ఉండదు అందుకని సురేఖని అడగమని చెప్పారట. సురేఖ చిరంజీవిని పెళ్లి చేసుకుంటానని చెప్పారట. అమ్మాయి ఒప్పుకుంది అని అల్లు రామలింగయ్య చిరంజీవితో పెళ్లిని ఏర్పాటు చేశారు. 1980 ఫిబ్రవరి 20న చిత్ర ప్రముఖుల సమక్షంలో వీళ్ళ పెళ్లి జరిగింది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!