Advertisement
సెప్టెంబర్ 19 నుండి టెస్ట్ సిరీస్ లు ప్రారంభం అవుతున్నాయి. అయితే ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ చెన్నైలో జరగబోతోంది. అయితే సెప్టెంబర్ 27 నుండి కాన్పూర్ లో జరుగుతాయి. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఈ టెస్ట్ సిరీస్ జరగబోతోంది. భారత జట్టు ఈ సిరీస్ లో మంచి ఫలితాలను సాధించాలని టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కు వెళ్లాలని కోరుకుంటుంది. అయితే మన దేశంలో జరుగుతున్నప్పుడు ఎంతో బలమైన జట్టులు కూడా ఓడించడానికి చాలా కష్టం. కాకపోతే బంగ్లాదేశ్ తో సిరీస్ అంటే సులువే అని అందరూ అనుకుంటారు. పైగా రోహిత్ శర్మదే పై చెయ్యి అవుతుంది, కానీ ఈసారి అలా అవ్వకూడదు అని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో అంటున్నాడు.
Advertisement
Advertisement
జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్లు గెలిచి భారత్ ను ఓడిస్తామని ఇదే మా లక్ష్యం అని పేర్కొన్నాడు. ఐదు రోజులు గట్టి పోటీని ఇచ్చి ఆఖరి సెక్షన్ లో పై చేయి సాధించి మ్యాచ్లు గెలుస్తామని అదే మా ప్రణాళిక అని వివరించాడు. రెండు టెస్టులను గెలిచేలా మేము ఆడుతాం, విజయం సాధించడానికి ప్రధానమైనది మనం ఆడే ప్రక్రియ. మా పనిని సమర్థవంతంగా నిర్వర్తించడమే లక్ష్యంగా ప్రయత్నిస్తాం అలా చేస్తే ఫలితాలు అవే వస్తాయి.
Also read:
పైగా ర్యాంకింగ్ పరంగా చూసుకుంటే భారత్ మాకంటే ఎంతో పై స్థాయిలో ఉంది కానీ మేము ఇప్పుడు బాగా ఆడుతున్నాం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయాన్ని సాధించింది. అదే నిజంగా భారతదేశాన్ని కూడా ఓడిస్తామని మాదే పై చేయి అని బంగ్లాదేశ్ కెప్టెన్ పేర్కొన్నాడు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!