Advertisement
అత్యంత వైభవంగా కొనసాగిన వినాయకుడు ఉత్సవాలకు నేటితో తెరపడబోతోంది. వినాయకుని నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జంట నగరాల్లో కన్నుల పండుగగా గణేష్ విగ్రహాల శోభాయాత్రలు మొదలయ్యాయి. పాతబస్తీ తో పాటుగా అన్ని ప్రాంతాల్లో నిమజ్జనం వేడుకల సంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
Advertisement
ఖైరతాబాద్ లో కొలువుతీరిన సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర తెల్లవారుజామున మొదలైంది. భారీ క్రేన్ సహాయంతో 70 అడుగుల మహా విగ్రహాన్ని పైకి చేర్చారు. గణేష్ ఉత్సవాలు సమితి ప్రతినిధులు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ హారతులు కూడా ఇచ్చారు. నిమజ్జనం రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి భక్తులు చేరుకున్నారు. భక్తిశ్రద్ధలతో గణపతికి పూజలు చేశారు.
గణేష్ నిమజ్జనం వేడుకల్లో CM రేవంత్ రెడ్డి మనవడు డ్యాన్స్..!!#RevanthReddy #CMRevanthReddy #GaneshImmersion #GaneshUtsav2024 pic.twitter.com/nW3swmRn5N
Advertisement
— oneindiatelugu (@oneindiatelugu) September 17, 2024
Also read:
గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు. ఘనంగా వీడ్కోలు పలికారు. నగరవ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జనం చురుకుగా సాగుతోంది. సందడిగా మారిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో పూజల్ని అందుకున్న వినాయకుడి విగ్రహం సైతం నిమంచడానికి తరలించారు. అందంగా అలంకరించిన ప్రత్యేక వాహనంలో గణేశ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి తో పాటుగా ఆయన భార్య గీతారెడ్డి కూతురు నైమిశా రెడ్డి మనవడు రేయాంష్ ఇందులో పాల్గొన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!