Advertisement
“నవ్విన ఏడ్చిన కన్నీళ్లే వస్తాయి. ఏ కన్నీటి వెనకాల ఏముందో తెలుసుకో” అని మనస్సు కవి ఆత్రేయ రాసిన పాటలో నిజంగా ఎంత అర్థం ఉందో అంతటి పరమార్థం కూడా ఉంది. ఏడిస్తే కన్నీళ్లు వస్తాయి. కానీ ఏడిస్తే మనిషికి మంచిది అని చెబుతున్నారు నిపుణులు. మనసులోని భావోద్వేగాలను ఆపుకోలేక పోతే అది కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది. వాటిని కన్నీళ్లు అంటాం. ఆడవాళ్లు ఏడిస్తే ‘ప్రతిదానికి ఎందుకు ఏడుస్తావు’ అంటారు. విసుక్కుంటారు మగవాళ్ళు. అదే మగవాళ్ళు ఏడిస్తే ‘ఏంటిరా ఆడదానిలా ఏడుస్తావు’ అంటారు.
Advertisement
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
కొంతమంది మాత్రం ఏడుపుని కూడా నవ్వు లాగానే ఒక ఎమోషన్ లాగా అనుకోని అందరి ముందు ఏడ్చినా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే కళ్ళలో నుంచి నీళ్లు వచ్చిన ప్రతిసారి అది బాధవలనే వస్తాయి అని అనుకోలేము. ఇది మనలో చాలామందికి తెలుసు. అయితే, మనం ఎలాగైతే వేరు వేరు ఎమోషన్స్ వచ్చినప్పుడు ఏడుస్తామో, అలా అలా ఆ ఎమోషన్ కి తగ్గట్టు కళ్ళలోంచి నీళ్లు వచ్చే విధానం కూడా మారుతుంది.
Advertisement
అంటే ఒక వ్యక్తి ఒకవేళ బాధలో ఉన్నప్పుడు మొదట వారి ఎడమ కంటి నుంచి కన్నీరు కారుతుంది. అదే ఒకవేళ ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఆనందభాష్పాలు వచ్చినప్పుడు మొదట కుడి కంట్లో నుండి కన్నీరు వస్తుంది. అదే ఒకవేళ వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు మాత్రం రెండు కళ్ళలో నుండి కన్నీరు వస్తుంది. ఇలా సందర్భానికి తగ్గట్టుగా కంట్లో నుండి వచ్చే కన్నీరు కూడా వేరేగా ఉంటుంది.
Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!