Advertisement
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందుత్వ వ్యతిరేక పార్టీ అనే ముద్రపడింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి నుంచి ఇటీవల జగన్ మోహన్ రెడ్డి వరకు తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం ప్రజల్లోకి మరీ ముఖ్యంగా హిందువులకి బలంగా వెళ్ళింది. భక్తిని వైసీపీ వ్యాపారంగా మార్చిందని ఆనాటి మంత్రి రోజా స్వామివారి దర్శనం పూజల పేరిట కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా సీఎం హోదాలో వైయస్ జగన్ ఆయన సతీమణి భారతి ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరించాలని ప్రచారం జరిగింది. అలాగే వైవి సుబ్బారెడ్డిని టిటిడి చైర్మన్ గా నియమించడం కూడా వివాదాస్పదంగా మారింది.
Advertisement
జగన్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి అందులో తిరుమల వ్యవహారం కూడా ఒకటి అందువలన నారా చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే మొదట తిరుమల నుంచి ప్రక్షాళన చేపడతానని చేసిన కామెంట్లు హైలైట్ అయ్యాయి. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీలో జరిగిన సంఘటనలు కూటమి ప్రభుత్వం బయట పెడుతోంది.
Advertisement
Also read:
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ హయాంలో తిరుమల లో ఎంత అపచారం జరిగిందో బయట పెట్టారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పాల్గొన్నారు. లడ్డు తయారీతో స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగిస్తారు కానీ ప్రభుత్వం టీటీడీ పాలకమండలి లడ్డు నాణ్యత గురించి పట్టించుకోలేదు. నెయ్యికి బదులు జంతువుల నూనెతో తయారుచేసిన పదార్థాలని వాడారని తెలుస్తోంది ఈ లడ్డూలనే భక్తులకి అమ్మారని చంద్రబాబు నాయుడు చెప్పారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!