Advertisement
అమ్మాయిలు ఫ్యాషన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కొత్త కొత్త దుస్తులని కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎక్కువమంది అమ్మాయిలు బిగుతుగా ఉండే జీన్స్ ని ధరిస్తారు. అయితే బిగుతుగా ఉండే జీన్స్ వేసుకోవడం వలన కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయట. ముఖ్యంగా ఆడవారికి సమస్యలు ఎక్కువగా వస్తాయట. జీన్స్ చర్మానికి గట్టిగా ఉండి చెమటను బయటకు వెళ్ళనివ్వదు. చర్మం చికాకు పడడం, ఇన్ఫెక్షన్లు రావడం వంటివి జరుగుతాయి.
Advertisement
తొడలు, జననేంద్రియాల ప్రాంతంలో ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి. అలాగే బిగుతుగా ఉండే జీన్స్ రక్తప్రసరణను అడ్డుకుంటుంది. దీనితో కింది భాగాలకు తగినంత రక్తం అందకపోవడం వలన నొప్పి, వాపు వంటి సమస్యలు వస్తాయి. బిగుతుగా ఉండే జీన్స్ జీర్ణవ్యవస్థ పై ఒత్తిడి తీసుకొస్తుంది. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది.
Advertisement
Also read:
బిగుతుగా ఉండే జీన్స్ వేసుకోవడం వలన నరాలని నొక్కి నొప్పిగా అనిపిస్తుంది. కాళ్లు చేతుల్లో ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. బిగుతుగా ఉంటే జననేంద్రియాల ప్రాంతంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీంతో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటివి కలుగుతాయి. మీ శరీరానికి సరిపడే జీన్స్ ని ధరించండి. బిగుతుగా లేదా వదులుగా ఉండే జీన్స్ వేసుకోవద్దు. ఒకసారి ఎక్కువ జీన్స్ ని ధరించకండి. కొంత సమయానికి తీసేసి ఒదులుగా ఉండే దుస్తులు వేసుకోండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి