Advertisement
బరువు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా ప్రమాదమే. చాలా మంది ఒక్కసారిగా బరువు పెరిగిపోతూ ఉంటారు. బరువు తగ్గడానికి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. బరువు పెరగక పోగా బరువు అసలు తగ్గరు. విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు. దీంతో ఒత్తిడికి కూడా గురవుతుంటారు. అకస్మాత్తుగా బరువు పెరిగిపోతూ ఉన్నట్లయితే మరింత టెన్షన్ ఎక్కువవుతుంది. అయితే ఉన్నటువంటి బరువు పెరగడానికి గల కారణాలు చూద్దాం. శారీరంలో హార్మోన్ల స్థాయిలో వచ్చే మార్పుల కారణంగా శరీరంలో జీవక్రియల పనితీరు నెమ్మదించడం వలన బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
Advertisement
Advertisement
ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లైతే కార్టోసోల్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతోంది. బరువు పెరిగిపోతారు. ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్స్ స్థాయిలపై సమయంలో సంభవించే మార్పులు కారణంగా బరువులో కూడా మార్పు వస్తుంది. విపరీతమైన ఒత్తిడి వలన కూడా చాలామంది మందులు వాడుతూ ఉంటారు. అలాగే గర్భనిరోధక మాత్రలు వాడుతూ ఉంటారు.
Also read:
వీటి వలన కూడా బరువు పెరిగి పోయే అవకాశం ఉంటుంది. కొంత మందిలో థైరాయిడ్ సమస్య వల్ల కూడా శరీరంలో బరువు విపరీతంగా పెంచుతుంది. ఆరోగ్య వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే థైరాయిడ్ గ్రంధి పని తీరు సరిగ్గా ఉండాలి. థైరాయిడ్ గ్రంధి పనితీరులో హెచ్చుతగ్గులు ఉంటే బరువు పెరిగిపోతారు. ఆకలి కూడా వేయదు.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!