Advertisement
వెంకటేశ్వర స్వామిని అందరూ ఆరాధిస్తూ ఉంటారు. ఏడుకొండల పై వెలసిన శ్రీవారి మహా ప్రసాదంగా తిరుమల లడ్డును భావిస్తారు. ఎంతో పవిత్రంగా చూస్తారు. అలాంటి తిరుమల లడ్డూని వైసీపీ పాలనలో అపవిత్రమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేశారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యిని వాడారు అన్న ఆరోపణలు కేవలం శ్రీవారి భక్తులకే కాదు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమైంది ఇలాంటి అపచారం జరగకుండా జాగ్రత్తలు చేపట్టింది.
Advertisement
ఇందుకోసం తిరుమలలోని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో శ్యామలరావు వెల్లడించారు. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడడం పై టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. లడ్డుతో పాటు స్వామివారికి సమర్పించే నైవేద్యంలో వాడే అనేక వస్తువులు బయట నుంచి వస్తాయి. వీటి నాణ్యతను పరిశీలించే సాంకేతిక సదుపాయం టీటీడీ దగ్గర లేదని తెలిపారు. దీన్ని ఆసరాగా చేసుకుని కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని ఈవో చెప్పారు తిరుమలలో కల్తీ నెయ్యి ని అరికట్టడానికి ఇకపై అత్యాధునిక సాంకేతికలను ఉపయోగించబోతున్నట్లు చెప్పారు.
Advertisement
Also read:
కల్తీ నెయ్యిని గుర్తించడానికి 75 లక్షలు విలువ చేసే ఆధునిక పరికరాలని సంస్థ విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. ఈ పరికరాలతో నూతన ల్యాబ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇకపై తిరుమలలో స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బ తినే వ్యవహారాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, వైష్ణవి, శ్రీ పరాగ్ మిల్క్, ఏ ఆర్ డైరీ సంస్థలు సరఫరా చేస్తుందని వారు చెప్పారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!