Advertisement
భర్తలని ఏమైనా తీసుకురమ్మనప్పుడు భార్యలు కచ్చితంగా అవి ఎలా ఉండాలి..? కొన్ని కారణాలు చెప్పి మరి కొనుగోలు చేయమంటారు. రిటైర్డ్ IFS అధికారి పంచుకున్న కూరగాయల జాబితాని ఇప్పుడు చూసారంటే షాక్ అవుతారు. ఇది కచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ మోహన్ పర్గన్ భార్య కూరగాయలు కొనడానికి ఇచ్చిన జాబితా ప్రకారం కూరగాయలు కొనుగోలు చూస్తే పక్కా పర్ఫెక్ట్ గా కొంటారు. మీ భార్య చేతిలో మీకు తిట్లు కూడా ఉండవు. ప్రతి కూరగాయ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు ఏం గమనించాలి..? ఆకారం నుంచి రంగు మచ్చలు వరకు డైరెక్ట్ గా ఇందులో రాసి పెట్టి ఉంచారు.
Advertisement
మెంతికూర పొట్టిగా ఉండాలి. ఆకులు పచ్చగా ఉండాలి. బెండకాయ మెత్తగా ఉండకూడదు గట్టిగా ఉండాలి ఈజీగా విరిగిపోవాలి. పాలకూర తాజాగా ఉండాలి. కానీ ఆకుల్లో రంధ్రాలు ఉండకూడదు. పచ్చిమిర్చి ముదురు ఆకుపచ్చ రంగులో ఉండాలి. చివర వంగి ఉండకూడదు. నిటారుగా ఉండాలి. ఇలా ఈమె రాసుకోచ్చారు.
Also read:
Advertisement
అలాగే ఇంటికి కావలసిన పాలు కూడా ఎలా ఉండాలి..? ఏ పాలని తీసుకురావాలి అనేది కూడా రాశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది దీనిపై స్పందించారు. కూరగాయల మార్కెట్ కు కొత్తగా వెళ్లి కొనుగోలు చేసే వారికి ఇది మార్గదర్శకం అని చాలామంది అంటున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్ భార్య సైన్యంలో పని చేసి ఉండొచ్చు అందుకే చక్కగా రాసారని కామెంట్స్ కూడా వస్తున్నాయి. పైగా ఇక్కడ కూరగాయల బొమ్మలు కూడా వేసి ఏవి కొనాలి ఏవి కొనకూడదు అనేది కూడా వర్ణించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!