Advertisement
జానీ మాస్టర్ అరెస్టైన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనని లైం%గికంగా వేధిస్తున్నారని ఆయన దగ్గర పని చేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకి కంప్లైంట్ చేశారు. ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అ%త్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని బయటకు ఎవరికీ చెప్పొద్దని ఆయన బెదిరించినట్లు వాపోయింది. అదేవిధంగా షూటింగ్ టైంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యకరంగా ప్రవర్తించేవాడని ఆమె చెప్పుకొచ్చింది.
Advertisement
పలుమార్లు జానీ మాస్టర్ లైం%గిక దాడికి పాల్పడ్డాడని.. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడని ఎఫ్ఐఆర్లో యువతి ఫిర్యాదు చేసింది. నాలుగు రోజులు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న జానీ ని గోవాలో అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పోలీసులు ఆయనను నేరుగా హైదరాబాద్ కి తీసుకొచ్చారు.
Advertisement
Also read:
జానీ మాస్టర్ ని విచారించేందుకు నార్సింగి పోలీసులు కస్టడీ పిటిషన్ ని దాఖలు చేశారు సోమవారం ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. జానీ పై పోక్సో కేసు నమోదు కావడంతో రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టుకు ఈ పిటిషన్ ని బదిలీ చేశారు. జానీ మాస్టర్ ని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి. జానీ మాస్టర్ ని పోలీసులు పది రోజులు కస్టడీ కోరినట్లు తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!