Advertisement
లడ్డు తయారీలో గత వైసీపీ ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుని వాడిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దేశం మొత్తం దుమారం చెలరేగింది. చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఉధృతికి దారితీస్తున్నాయి. ఈ విమర్శలపై వైసీపీ నాయకులు కూడా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు శ్రీవారి లడ్డు వివాదంపై పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. తిరుమల శ్రీవారిపై జగన్ కి ఉన్న భక్తి గురించి వైసీపీ కొన్ని సంఘటనలు ఉదాహరణగా గుర్తుచేస్తోంది.
Advertisement
TTD కి సంబంధించిన ఆస్తులు అమ్మడం జరుగుతుండేది కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటికి ముగింపు పలికారని అంటున్నారు. తిరుమలకు భక్తులు ఇచ్చిన ఆస్తులు నిరార్ధకరమైన వాటిని విక్రయించే విధానం పై శాశ్వత నిషేధం విధిస్తూ తీర్మానించారు జగన్ అని అన్నారు. దేవస్థానం ఆస్తుల అమ్మకాన్ని ఆపేయాలని జగన్ కోరారని అంతేకాకుండా టీటీడీ ఆస్తులు విషయంలో మరింత పారదర్శకంగా ఉండేందుకు వీలుగా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది.
Advertisement
Also read:
భక్తులకు అనుకూల రూపంలో ఇచ్చే ఆస్తుల అమ్మకాని పూర్తిగా నిషేధించాలని తీర్మానం చేస్తూ అప్పుడు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి నేతృత్వంలో బోర్డు నిర్ణయం తీసుకుందని చెప్పారు. శ్రీవారి భక్తులు సమర్పించిన ఆస్తులు వివరాలను వెబ్సైట్లో ఉంచడం జరుగుతూ వచ్చింది. అయితే టీటీడీ పారదర్శకంగా నడిచింది అనడానికి ఇంతకంటే రుజువు ఇంకేం కావాలని వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!