Advertisement
టీటీడీ పాలకమండలకు నేతృత్వం వహించిన వాళ్ళు టీటీడీ ఆస్తులు కాపాడ్డానికి ప్రయత్నం చేశారా..? ఆస్తుల్ని విక్రయించడానికి ప్రయత్నం చేశారా..? పాలకమండలను నడిపింది ఎవరు అనే వివరాలను ఇప్పుడు బయటకు లాగుతున్నారు. వాళ్ళ పేర్లు కూడా ప్రజల ముందు పెడతామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన శ్రీవారి ఆస్తులతో చెలగాటమాడిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని అన్నారు.
Advertisement
టీటీడీ ఆస్తులు విషయంలో గత పాలకమండలలు తీసుకున్న నిర్ణయాలపై సమగ్ర విచారణ చేస్తామని అందుకే ఏపీలోని అన్ని దేవాలయాల భూములు పై సమీక్ష నిర్వహించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీవారి ఆస్తుల్ని పరిరక్షించే బాధ్యతను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో ఆడుకోవడం సిగ్గుచేటు అని అన్నారు.
Advertisement
Also read:
ఇదివరకు తమిళనాడులోని 23 ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని గత పాలకమండలి నిర్ణయించిందని వాటి విలువ 23 కోట్లకు పైగా ఉంటుందని.. నిరార్ధక ఆస్తుల ద్వారా 100 కోట్లు సమకూర్చుకోవాలని ప్రయత్నాలు జరిగాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని హిందూధార్మిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించడంతో నిలిపి వేశారని అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!