Advertisement
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా వస్తారేమో అని భావిస్తున్నారు. దేవర సినిమా రిలీజ్ టైం లో కూడా చాలా మంది అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం జరిగింది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పొలిటికల్ ఎంట్రీ గురించి తారక్ పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చారు. కెరియర్ పరంగా నటుడు కావాలని అనుకున్నానని అన్నారు. 17 ఏళ్ల వయసులో తాను తొలి సినిమాలో నటించానని తారక్ పేర్కొన్నారు.
Advertisement
అప్పటి నుంచి నా దృష్టి యాక్టింగ్ వైపు మాత్రమే ఉందని అన్నారు. ఓట్ల విషయాన్ని పక్కన పెడితే ఫ్యాన్స్ నా కోసం మూవీ టికెట్లు కొంటున్నారని.. ఇంత మంది ప్రజల్ని తాను కలుస్తున్నానని చెప్పారు. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ప్రస్తుతం యాక్టర్ గా సంతోషంగా ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు.
Advertisement
Also read:
ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ కొంతమంది అభిమానుల్ని నిరాశపరిచాయి. భవిష్యత్తులో రాజకీయాల గురించి ఆలోచిస్తానేమో అని చెప్పి ఉంటే బాగుండేదని కొంతమంది అంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తారక్ ఆలోచనలు కూడా మారుతాయేమో చూడాలి. ఒకవేళ తారక్ నిజంగానే రాజకీయాల్లోకి వస్తే ఆయన అభిమానులు ఫుల్ కుష్ అవుతారు. ఫస్ట్ వీక్ కలెక్షన్లతో 350 కోట్ల రూపాయల మార్క్ ని టచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!