Advertisement
ఎన్టీఆర్ దేవర సినిమాతో అద్భుతాన్ని సృష్టించారని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల సునామీని సృష్టిస్తోందో మనందరం చూస్తున్నాం. ఆరంభంలో డివైడ్ టాక్ తో మొదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. మొదట రోజు ఓపెనింగ్స్ లో 110 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ వసూళ్లని కాబట్టి సంచలనాన్ని సృష్టించిన ఈ మూవీ వీకెండ్ లో కూడా అదే తరహాలో జోరుని కొనసాగించింది. 250 కోట్ల రూపాయల గ్రాస్ ని సినిమా రాబట్టింది.
Advertisement
Advertisement
RRR చిత్రానికి ముందు ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రం చేశాడు. ఈ సినిమాకి ఫుల్ రన్ లో 85 కోట్ల రూపాయలు షేర్లు వసూలు చేశాయి. కానీ దేవర చిత్రానికి మొదటి రోజే 90 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూల్ చేయడం అనేది రావడం చూస్తే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. ఇంతటి ఘన విజయాన్ని అందుకున్న తర్వాత విజయోత్సవ సభ లేకుండా అభిమానులు ఎందుకు ఊరుకుంటారు..?
Also read:
భారీ లెవెల్లో ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సెక్యూరిటీ సమస్యల కారణంగా రద్దు అయిపోయింది. ఈ విషయంపై అభిమానులు మూవీ టీం పై చాలా ఫైర్ మీదున్నారు. అక్టోబర్ రెండవ తేదీన రామోజీ ఫిలిం సిటీ లో ఈవెంట్ ని వేలాది మంది అభిమానుల సమక్షంలో జరుపబోతున్నట్లు తెలుస్తోంది. ఈవెంట్ కి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తిస్థాయిలో క్లారిటీ అయితే రావాలి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!