Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిలో శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి దేవాలయం ఒకటి. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది. అక్కడ సూర్యకిరణాలు ఆలయంలో సూర్య భగవానుడి పాదాలను తాకడం జరిగింది. ఈ అద్భుత దృశ్యాన్ని ఎందరో భక్తులు చూశారు. సూర్యుని కిరణాలు పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య సూర్యభగవానుని తాకడం విశేషం.
Advertisement
మంగళవారం ఉదయం 6:05 గంటలకు ఈ దృశ్యాన్ని చూడడానికి ఎందరో భక్తులు తరలి వచ్చారు. అయితే ఇదే సంఘటన రేపు కూడా ఉండొచ్చు అని ఆలయ అధికారులు భావిస్తున్నారు. దాంతో బుధవారం స్వామివారి మూలవిరాట్ ను సూర్య కిరణాలు తాకే అవకాశం ఉందని ఆలయ పండితులు పేర్కొనడం జరిగింది.
Advertisement
Also read:
అయితే ఈ దృశ్యం ప్రతి సంవత్సరం రెండుసార్లు మాత్రమే జరుగుతుందని ప్రతి ఏడాది మార్చి 9, 10 తేదీల్లో అలాగే అక్టోబర్ నెల 1, 2 తేదీల్లో మూలవిరాట్ ను నేరుగా సూర్య కిరణాలు తాకుతాయి. అయితే ఈ దృశ్యాన్ని చూసిన భక్తులందరూ జన్మ ధన్యమైంది అని అంటున్నారు. అంతేకాక ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సూర్యకిరణాలు తాకే సమయానికి సూర్యనారాయణ మూర్తిని దర్శించుకోవడం వలన ఎంతో మంచి జరుగుతుంది అని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ సమయంలో చాలా మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ దర్శన భాగ్యం కలగడంతో ఎంతో సంతోషంగా ఉంది అని భక్తులు చెబుతున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!