Advertisement
తెలంగాణ మంత్రి కొండా సురేఖ బాధ్యతమైన పదవిలో ఉండి సమంత పై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంశంగా మారాయి. ప్రముఖ హీరోయిన్ వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి దారుణంగా కొండ సురేఖ చేసిన ఆరోపణలు ప్రతి ఒక్కరిని బాధకు గురుస్తున్నాయి. రాజకీయంగా మాజీ మంత్రి కేటీఆర్ ని ఇరకటంలో పెట్టాలని చూసిన కొండా సురేఖ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలంటే కేటీఆర్ సమంతను పంపించాలని అడిగాడని నాగార్జున నాగచైతన్య సమంత పైన కేటీఆర్ దగ్గరకు వెళ్ళమని ఒత్తిడి తీసుకు వచ్చారని.. దీనికి సమంత అంగీకరించకపోవడంతో విడాకులు ఇచ్చాడని మంత్రి కొండా సురేఖ దారుణమైన కామెంట్స్ చేశారు.
Advertisement
Advertisement
ఈ ఆరోపణలతో నోటికి వచ్చినట్లు మాట్లాడే సురేఖ మంత్రి పదవికి అనర్హురాలని పెద్ద ఎత్తున ఆమె పై మండిపడుతున్నారు. తక్షణమే రాజీనామా చేయాలని ప్రఖ్యాతి పార్టీల నుంచి డిమాండ్ వినపడుతోంది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండగా ఇలా ఓ మహిళ పట్ల అత్యంత హేయమైన దారుణమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్ని ఎటువైపు తీసుకు వెళుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Also read:
రాహుల్ గాంధీ సైతం కొండ సురేఖ యొక్క అనుచిత వైఖరి పట్ల ఫిర్యాదులు చేశారు. నాగచైతన్య, నాగార్జున, సమంత అభిమానులు కొండా సురేఖను టార్గెట్ చేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సమయంలో కొండా సురేఖ పట్ల ఒక్కసారిగా వ్యక్తం అవుతున్న నిరసనలు మంత్రి పదవికి గండం తీసుకొచ్చింది. సొంత పార్టీలో కూడా ఆమె పట్ల తీవ్రవ్యతరేకత కనబడుతోంది. సురేఖ వ్యాఖ్యల పైన అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!