Advertisement
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హిందు ఆలయాలు ఉన్నాయి. అయితే అత్యంత ప్రసిద్ధిగాంచినది తిరుపల తిరుపతి దేవస్థానం. కలియుగ వైకుంఠంగా భావించే దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. సాక్షాత్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన ఈ దివ్య క్షేత్రంలో బ్రిటిష్ వాళ్ళు కొన్ని నియమాలను కూడా పెట్టారు అవేంటో ఇప్పుడు చూద్దాం.. మన దేశంలో 200 ఏళ్లకు పైగా పరిపాలించిన బ్రిటిష్ దొరలు వెంకటేశ్వర స్వామి భక్తులుగా మారడమే కాదు. గుడి అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.
Advertisement
టీటీడీ దగ్గర ఉన్న పురాతన ఆలయ రికార్డుల ప్రకారం చూసినట్లయితే 1801 నుంచి 1843 మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షణ బాధ్యతలను అప్పటి ఈస్టిండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నార్త్ అర్కాట్ నేతృత్వంలో జరిగిందట. అప్పట్లో ఓ దేవాలయంలో ఎన్నో అంతర్గత కలహాలు ఉండడం వలన అమ్ బ్రిటిష్ వాళ్ళు కఠినమైన క్రమశిక్షణ నియమాలతో పాలనను గాడిలో పెట్టారు. తొలిసారిగా మద్రాస్ లోని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వానికి కాటన్ దొర నివేదికని సమర్పించారు. తర్వాత విచారణ అధికారిగా వచ్చిన పి బ్రూస్ టిటిడి పాలనకు ఐదు మార్గదర్శకాలని నిర్దేశించారు.
దిట్టం
Advertisement
నైవేద్యానికి సంబంధించిన ముడి ఏ పరిమాణంలో తీసుకోవాలి అనేదే దిట్టం. ఇక్కడ చేసే లడ్డూలు దగ్గర నుంచి వాడే పుష్పాల వరకు దీనిని ఫాలో అవుతారు.
కైంకర్యపట్టీ
సిబ్బంది, పరిచారికలు, మిరాశీ దారులు మరియు జియ్యర్ సిబ్బంది విధులకు ఈ కైంకర్యపట్టీ తయారు చేయడం జరిగింది. నియామకం, హోదా, విధులు, జీతభత్యాలు దీనిపై ఆధారపడి ఉంటాయి.
బ్రూస్ కోడ్
ఇదేంటంటే ఈస్ట్ ఇండియా కోడ్ ఆఫ్ డైరెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఆలయ పాలన సక్రమంగా జరగాలని బ్రూస్ కోడ్ అనే ప్రత్యేకమైన కోడ్ రూపొందించడం జరిగింది. ఇప్పటికీ ఈ బ్రూస్ కోడ్ వాడుతారు.
Also read:
సవాల్- ఇ-జవాబు
ఇక్కడ జరిగే వివిధ సేవలు, సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, ఆలయ ఖర్చులు, ఆదాయం.. తిరుమల ఇతిహాసం, చరిత్రను తెలుసుకొనడం కోసం 1819లో ఈస్ట్ ఇండియా కంపెనీ 14 ప్రశ్నలు వేసి సమాధానాలను రూపొందించింది.
పైమేయిషి ఖాతా
ఆలయానికి సంబంధించిన స్థిరచరాస్తులు, దేవతా విగ్రహాలు, చిత్రాలు, అలాగే ఇతర పరిసర ప్రాంతాలలో ఉన్న ఆలయ వివరాలు, ఇనాంగా ఇచ్చిన గ్రామాల యొక్క వివరాలను రికార్డు రూపంలో పొందపరిచడం జరిగింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!