Advertisement
తెలంగాణ మంత్రి కొండా సురేఖ నాగచైతన్య, సమంత గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ అనే చెప్పవచ్చు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరియు రాజకీయాలలో సంచలనంగా మారాయి అని చెప్పవచ్చు. ఈ విషయంపై నాగార్జున, అమల, ఎన్టీఆర్, నాని మొదలగు సెలబ్రిటీలు స్పందించారు. నాగార్జున అయితే చట్టపరమైన చర్యలను కూడా తీసుకున్నారు, పరువు నష్టం దావా కూడా వేయడం జరిగింది. నిన్న కోర్టులో కేసు విచారణ జరగాల్సి ఉండగా వాయిదా పడింది. అయితే ఈ కేసు నాంపల్లి కోర్టులో సోమవారం నాడు విచారణకు రానుంది. నాగార్జున మాత్రమే కాకుండా కేటీఆర్ కూడా లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది.
Advertisement
Advertisement
తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగార్జున మరొకసారి సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మరొక 100 కోట్ల పరువు నష్టం దావా వేసే పనిలో ఉన్నాము అని తెలిపారు. ఆమె చేసిన వ్యాఖ్యలు మా కుటుంబాన్ని ఎంతగానో బాధించాయి అని చెప్పారు.
Also read:
మంత్రి సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పింది కానీ నాకు, మా కుటుంబానికి మాత్రం కాదు అని నాగార్జున అన్నారు. ఒకవేళ మీకు, మీ కుటుంబానికి క్షమాపణలు చెబితే కేసు వాపస్ తీసుకుంటారా అని అడగడంతో కుదరదు అని సమాధానం ఇచ్చారు. నా కుటుంబానికి క్షమాపణ చెప్పినా కేసును మాత్రం వదిలే ప్రసక్తి లేదు అని తెలిపారు. అలా చేస్తేనే హెచ్చరిక అవుతుందని కుటుంబం విషయానికి వస్తే సింహంలా పోరాటం చేస్తాను అని తెలిపారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!