Advertisement
టాలీవుడ్ సీనియర్ హీరో అయినా రాజేంద్రప్రసాద్ ఇంట్లో ఒక తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది.ఈయనకు ఒక్కగానొక్క కూతురు గాయత్రి శనివారం నాడు గుండెపోటుతో కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ రావడంతో నిన్న హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అయితే హాస్పటల్లో చికిత్స పొందుతూ శనివారం ఆమె మరణించారు. కన్న కూతురు మరణించడంతో రాజేంద్రప్రసాద్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కూతురి మరణంతో ఒక్కసారిగా రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదానికి గురయ్యారు.
Advertisement
ఇప్పటికే ఆమె మరణం గురించి తెలుసుకున్న ప్రముఖులు, సినీ నటులు ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు, మరికొందరు రాజేంద్రప్రసాద్ ఇంటికి చేరుకుని పరామర్శిస్తున్నారు. నటుడుగా ఉన్నత స్థాయికి ఎదిగిన రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన విషయం అందరికీ తెలిసినదే. తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇప్పుడు తన కూతురు గురించి మాట్లాడిన మాటలు కు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
Also read:
ఆయన తన కూతురు గురించి మాట్లాడుతూ ఒక సినిమాలో సుద్దాల అశోక్ తేజ పాట రాశారు. దాని గురించి వివరిస్తూ అమ్మ లేని వాడు కూతురు లో అమ్మని చూసుకుంటాడు అదేవిధంగా నా జీవితంలో కూడా పదేళ్ల వయసులోనే మా అమ్మ చనిపోయారు అయితే నేను కూడా నా కూతురు లో అమ్మని చూసుకున్నాను. ఇప్పుడు నా కూతురికి నాకు మాటలు లేవు. ఆమె ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. ఈ సినిమాలో అమ్మ పాటను తన కూతురిని ఇంటికి పిలిపించి నాలుగు సార్లు వినిపించాను అని రాజేంద్రప్రసాద్ ఆ వీడియోలో అన్నారు. ఇప్పుడు ఆమె అనారోగ్యంతో మరణించడంతో రాజేంద్రప్రసాద్ కుటుంబం శోక సంద్రానికి గురైంది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!