Advertisement
టాలీవుడ్ ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి తాజాగా బాలయ్య గురించి కొన్ని కామెంట్స్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదివరకు పవన్ కళ్యాణ్ కోసం తిట్టినట్టు ప్రూవ్ చేస్తే నేను లైవ్ లో గొంతు కోసుకొని చనిపోతానని పోసాని అన్నారు. ఈ విధంగా అనడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తన కుటుంబాన్ని తిట్టారని పోసాని వెల్లడించారు. ఆ సమయంలో ఎటువంటి మద్దతు నాకు తెలుపలేదని పోసాని చెప్పడం జరిగింది. అయితే సినిమా ఇండస్ట్రీ పరువు కోసం ప్రతి సందర్భంలో తాను ముందుకు వచ్చానని అన్నారు.
Advertisement
సినిమా కళామతల్లి నా కన్నతల్లి అని, ప్రతిసారి న్యాయం వైపు మాత్రమే ఉంటుందని ఆయన పేర్కొనడం జరిగింది. అయితే నా ఫ్యామిలీ పై జరిగిన మాటల దాడిని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఖండించినా బాలయ్య ఫ్యామిలీ మాత్రం ఖండించలేదని చెప్పారు. బాలకృష్ణ గతంలో ఆడపిల్లలకు కడుపైనా చేయాలని ముద్దయినా పెట్టాలని కామెంట్ చేశారని, అలాంటి వ్యక్తి నుంచి సురేఖ క్షమాపణలు చెప్పాలనే కామెంట్లు మనం చూడగలమా అని పోసాని ప్రశ్నించడం జరిగింది.
Advertisement
Also read:
ఈ సంఘటన గురించి మాట్లాడుతూ నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. ఈ సంఘటన గురించి బాలకృష్ణ కూడా రియాక్ట్ అయితే బాగుంటుంది అని ఈయనా అంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ వరుసగా సినిమాలు చేయడంతో ఎంతో బిజీగా ఉన్నారని అందరికీ తెలిసిందే. ఎన్నో ప్రాజెక్ట్‌లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు మరియు తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అన్ని భాషల్లో సత్తా చాటేలా బాలయ్య ప్లాన్స్ ఉన్నాయి.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!