Advertisement
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కారుని కొనుకుంటున్నారు. కారు ఉండడం వలన ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఎక్కడికైనా క్షణాల్లో వెళ్ళిపోవచ్చు. అయితే కొన్ని కొన్ని సార్లు కార్లపై స్క్రాచ్లు, మరకలు వంటివి పడుతూ ఉంటాయి. అలాంటి వాటిని ఎలా తొలగించాలి అనేది చూద్దాం. కారుపై గీతలు ఉన్నట్లయితే ఇలా చేయండి. బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లాగా చేసుకోండి. ఈ పేస్ట్ ని ఒక క్లాత్ సహాయంతో గీతలు పడిన ప్రాంతంలో అప్లై చేయాలి. తర్వాత క్లీన్ చేయండి.
Advertisement
ఇలా చేస్తే మరకలు తగ్గిపోతాయి. ఒకవేళ అలా చేసినా తగ్గకపోతే ప్రొఫెషనల్ సలహా తీసుకోవడం మంచిది. ఒకవేళ కనుక కారుపై గీతలు పడినట్లయితే వెనిగర్, కొబ్బరి నూనెని సమాన పరిణామములో కలపాలి. గీతలు ఉన్నచోట రాయాలి. టిష్యూ పెట్టి మీరు రబ్ చెయ్యచ్చు. మరక లైట్ గా మారిపోతుంది అంతే.
Advertisement
Also read:
బఫింగ్ మిషన్ వాడడం వలన మరకలు పోతాయి. ఈ మిషన్ కి రొటేటింగ్ ప్యాచ్ ఉంటాయి ఇవి వాడే ముందు మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళం మంచిది. చిన్న గీతల కోసం కొద్దిగా టచ్ అప్, పెయింటింగ్ చిన్న బ్రష్ లేదా టూత్ పిక్ వాడొచ్చు. పూర్తిగా ఆరిన తర్వాత సాండ్ పేపర్ ని ఉపయోగించండి. పళ్ళు తోముకునే టూత్ పేస్ట్ ని కారు గీతలపై రాసి కూడా గీతల్ని తొలగించొచ్చు. కాస్త డ్రై అయిన తర్వాత తడిగా ఉన్న గుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!