Advertisement
పిల్లలకి తల్లిదండ్రులు ఏం నేర్పిస్తారో తల్లిదండ్రులు వాటినే అనుసరిస్తారు. పిల్లలకు నేర్పించాల్సిన పరిశుభ్రత అలవాట్లు గురించి ఇప్పుడు చూద్దాం. వీటిని కనక మీరు మీ పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు క్లీన్ గా ఉంటారు. పిల్లలు ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వారికి పరిశుభ్రత పై చిన్నప్పటి నుంచి అవగాహనని కల్పించాలి. పిల్లలు భోజనం చేసే ముందు బయటకు వెళ్లి వచ్చిన తర్వాత చేతుల్ని క్లీన్ చేసేటట్టు చూసుకోవాలి. హ్యాండ్ వాష్ చేసుకునే విధంగా పిల్లలకు మీరు నేర్పించాలి. తినడానికి ముందు పండ్లు, కూరగాయలని నీటితో కడిగే విధంగా వాళ్లకు చెప్తూ ఉండాలి. పండ్లు, కూరగాయలపై ఉండే బ్యాక్టీరియా గురించి వాళ్ళకి వివరంగా చెప్పాలి.
Advertisement
Advertisement
దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోటికి టిష్యుని అడ్డు పెట్టుకోవడం లేదంటే రుమాలు అడ్డు పెట్టుకోవడం వంటివి నేర్పాలి అలాగే పిల్లలకి చిన్నప్పటి నుంచి బ్రష్ చేసుకునే విధంగా నేర్పించాలి. దంతాల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టేలా చూసుకోవాలి. రోజు పొద్దున్నే బ్రష్ చేసాక స్నానం చేసేలా అలవాటు చేయాలి. ఎక్కడికైనా బయటకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా స్నానం చేయించాలి.
Also read:
పిల్లలు రోజూ ఉతికిన దుస్తులను ధరించే విధంగా చూసుకోవాలి. మాసిపోయిన బట్టలు వేసుకోవడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. పిల్లలు వాడే రీడింగ్ రూమ్ ని కూడా క్లీన్ చేస్తూ ఉండాలి. పిల్లల రోజూ ఉపయోగించే వస్తువులన్నీ కూడా సరిగ్గా సర్దుకునే విధంగా వాళ్లకు అలవాటు చేయాలి. ఎప్పటికప్పుడు గోళ్లను కత్తిరించుకునే విధంగా వారికి అలవాటు చేయాలి ఇలా వాళ్ళకి వీటిని తల్లిదండ్రులు నేర్పిస్తే పిల్లలకి కూడా మంచి అలవాట్లు వస్తాయి శుభ్రత ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!