Advertisement
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఒక స్టార్ హీరో గా కొనసాగుతూ వస్తున్న సీనియర్ హీరో మెగాస్టార్.. ప్రస్తుతం ఉన్న యంగ్ జెనరేషన్ హీరోలతో పోటీపడుతూ ఇప్పటికి ఆయన సినిమాలు తీస్తూనే ఉన్నారు..అయితే అలాంటి మెగాస్టార్ పక్కన నటించాలని ఏ నటులకైనా ఉంటుంది. అంతటి స్టార్డమ్ ఉన్న ఈ హీరోతో ఈ నలుగురు హీరోయిన్లు మాత్రం నటించలేదట.. కారణం ఏంటో ఒక సారి చూద్దాం.. ప్రస్తుతం మారిన పరిస్థితుల దృష్ట్యా చిరంజీవి సరసన అనుష్క, నయనతార,త్రిష లాంటి హీరోయిన్లను ఎంపిక చేస్తూ వస్తున్నారు.వాళ్ళు ఒకప్పుడు ఆయన సరసన నటించి వారి యొక్క స్టార్డమ్ ని పెంచుకున్న వారే. కానీ ఆ నలుగురు హీరోయిన్లు మాత్రం ఆయనకు అంతటి స్టార్డం ఉన్నా కానీ నటించలేదు.
Advertisement
Also Read: పవన్ తో సినిమా అంటే రిజెక్ట్ చేసిన శోభన్ బాబు.. అసలు కారణం ఇదేనా..?
రజిని :
దర్శకరత్న బ్రహ్మముడి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రజినిని చూసి అప్పట్లో జయప్రద,రాధాలా ఉంది అనేవారు. రజిని దాదాపు 150 సినిమాల్లో హీరోయిన్గా చేసి, కృష్ణ,శోభన్ బాబు,నాగార్జున వెంకటేష్, అర్జున్,రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్,చంద్రమోహన్, మోహన్ బాబు, నరేష్ ఇలా అప్పుడు ఉన్న అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. కానీ ఒక్క మెగాస్టార్ తో మాత్రం నటించలేదు. దీనికి కారణం ఒక ఇంటర్వ్యూలో చెబుతూ చిరంజీవి తో ఒకటి రెండు సార్లు ఆఫర్స్ వచ్చినా ఇండస్ట్రీలోని లాబీయింగ్ తోనే ఆ చాన్స్ మిస్ అయిందని తెలిపింది.
Advertisement
అశ్విని :
ఆ సమయంలోనే అశ్విని కూడా మంచి పేరు తెచ్చుకుని మాస్ క్యారెక్టర్లు చేస్తూ కుటుంబ కథా చిత్రాల్లో నటించిన అశ్విని చాలా చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించింది. ఈమె కూడా తెలుగులో అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఈమె బాలకృష్ణ తో భానుమతిగారి మొగుడు చేసిన సమయంలో ఆమెకు మెగాస్టార్ తో ఛాన్స్ వచ్చినా అది చేజారిపోయింది.
ఆమని :
తెలుగులో టాప్ హీరోలైన కృష్ణ, బాలకృష్ణ, నాగార్జున, సుమన్,మోహన్ బాబు లాంటి వారితోనే కాకుండా తమిళ స్టార్ హీరోలతో కూడా హీరోయిన్ గా చేసి మెప్పించింది. మెగాస్టార్ తో సినిమా వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందని ఇప్పటికీ బాధపడుతుంది ఆమని.
ఇంద్రజ :
ఇంద్రజ కూడా తెలుగు ఇండస్ట్రీలో అందరూ స్టార్ హీరోలతో సినిమా చేసి మెప్పించింది. ఇంద్రజ చేసిన పెద్దన్నయ్య చూసిన తర్వాత మెగాస్టార్ సరసన నటిస్తుంది అనుకున్నారు. దీని తర్వాత ఇంద్రజ చిన్న చిన్న హీరోలతో చేయడంతో నిర్మాతలు, దర్శకులు చిరంజీవితో చేయడానికి ఒప్పుకోలేదు.
ALSO READ: