Advertisement
హీరో విరాట్ కర్ణ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పెద్దకాపు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చారు. ఈ మూవీ తో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచినప్పటికీ హీరోగా విరాట్ కి మాత్రం గుర్తింపు వచ్చింది. విరాట్ కర్ణ తదుపరి చిత్రం నాగబంధం ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. క్లాప్ కూడా కొట్టారు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా బడ్జెట్ కి సంబంధించి పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాపై దాదాపు 70 కోట్లు ఖర్చు చేశారని టాక్. పైగా ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి.
Advertisement
70 కోట్లు ఎక్కువ అని అనుకుంటున్న నేపథ్యంలో సినిమా పెట్టుబడి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలియడంతో రిస్క్ చేస్తున్నారా అనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈయన మొదటి సినిమా పెద్దకాపు పెద్ద డిజాస్టర్ గా నిలవడంతో పాటుగా 40 కోట్ల బడ్జెట్ పెట్టగా అందులో పావు వంతు కూడా తిరిగి రాలేదు. ఈ సినిమా మీద ఎన్ని కోట్ల అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అభిషేక్ నామ దర్శకత్వం వహిస్తున్నారు.
Advertisement
Also read:
ఆయనకి దర్శకుడుగా పెద్దగా అనుభవం లేదు. కానీ కథ అంత ఖర్చు డిమాండ్ చేస్తోందని.. సోషియో ఫాంటసీ అంశాలతో ముడిపడిన కథ ఇది అని తెలుస్తోంది. గ్రాఫిక్స్ తోనే నడుస్తుందట. పద్మనాభ స్వామి టెంపుల్ చుట్టూ సాగే కథ ఇదని తెలుస్తోంది. నభ నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈనెల 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది ఇందులో కొంతమంది పాన్ ఇండియా స్టార్లు కూడా కనబడుతున్నట్లు సమాచారం.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!