Advertisement
కొంతమంది చిన్నపిల్లలు కోపం వస్తే చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని విసిరేస్తుంటారు. ఇంకొంతమంది కొట్టడం, కొరకడం ఇలా చేస్తూ ఉంటారు. పిల్లలకు కూడా చాలా కోపం ఉంటుంది. వాళ్లకి కోపం వచ్చినప్పుడు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. పిల్లలు కొంచెం పెద్దయిన తర్వాత మొబైల్ చూస్తున్నప్పుడు మనం అడిగినా లేదంటే ఆటలు చాలు పుస్తకం తెరవమన్నా ఇలా ఏమైనా చెప్తే కూడా వాళ్ళు కోపాన్ని చూపిస్తూ ఉంటారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఒకరిపై ఇంకొకరు ఫిర్యాదులు చేసుకోవడం గొడవలు పడడం వంటివి చేస్తూ ఉంటారు. పిల్లలకు కోపాన్ని కంట్రోల్ చేయడం మన నేర్పించగలిగితే చాలా సమస్యలు తగ్గిపోతాయి.
Advertisement
Advertisement
పెద్దవాళ్లు తమ కోపాన్ని ఎలా నియంత్రించుకుంటారో పిల్లలు ఇంట్లో గమనిస్తారు. కోపం వచ్చినప్పుడు ప్రశాంతంగా హుందాక వ్యవహరిస్తే పిల్లలు కూడా అదే పద్ధతిని అలవాటు చేసుకుంటారు. పిల్లలు కోప్పడిన సమయంలో కోపానికి కారణం ఏంటి అనేది అడిగి తెలుసుకోవాలి. అలానే సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపించాలి కోపాన్ని చూపించడంలో ఒక్కొక్కరిది ఒక్కోసారి ఉంటుంది. కొందరు పిల్లలు అందరి నుంచి దూరంగా వెళ్లి కూర్చుంటే మరి కొంతమంది పిల్లలు ఏది పడితే అది విసిరేస్తుంటారు. ఇతరుల కొరుకుతూ ఉంటారు అలా కాకుండా కోపం వచ్చినప్పుడు ఫీలింగ్స్ ఏంటో పేపర్ పై రాయమని చెప్పడం అలవాటు చేయాలి.
Also read:
తర్వాత ఫీలింగ్స్ గురించి పిల్లలతో కూర్చుని చర్చించాలి వాటి వలన జరిగే అనర్ధాలు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఆకలి నిద్రలేమి ఒత్తిడి కూడా కోపాన్ని కలిగిస్తుంది పిల్లలు కోపంతో తప్పు చేసిన వాళ్ళని కొట్టడం తిట్టడం వంటివి చేయకూడదు. పిల్లల్లో కోపం సున్నితమైన భావం. ఆ భావాన్ని తల్లిదండ్రులుగా మనం అర్థం చేసుకోకుండా వాళ్ళపై కోప్పడితే ఎప్పటికీ వారికి నేర్పించలేము.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!