Advertisement
ఇదివరకు తెలుగు సినిమాకి 100 కోట్లు బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్ వచ్చింది అంటే ఎంతో గొప్పగా చెప్పుకునే వారు. అయితే ప్రస్తుతం రోజులు మారాయి, ఒకప్పుడు టికెట్ రేట్లు ఎంతో తక్కువగా ఉండేవి పెద్ద సినిమా రిలీజ్ అయిన కూడా స్క్రీన్స్ అంతంత మాత్రమే ఉండేవి. దాంతో ఎక్కువ బడ్జెట్ తో రిలీజ్ చేసినా కలెక్షన్లు భారీగా వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎక్కువ స్క్రీన్స్ లో సినిమాలు విడుదల అవుతున్నాయి. మొదటి వీకెండ్ కి భారీగా కలెక్ట్ చేయాలని డిస్ట్రిబ్యూటర్స్ టికెట్ రేట్లను పెంచమని కోరగా ప్రభుత్వం అంగీకరించి టికెట్ రేట్లను పెంచింది. బాక్స్ ఆఫీస్ వద్ద దేవర తో పాటుగా ఈ సినిమాలు కూడా 100 కోట్ల ను దాటాయి.
Advertisement
ఆర్ఆర్ఆర్
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్స్ ఆఫీస్ లో 413 కోట్లను కలెక్ట్ చేసింది.
బాహుబలి 2
బాహుబలి 2 విడుదల అయినప్పుడు టికెట్ రేట్లు అంతంత మాత్రం ఉన్నా సరే 330 కోట్లను కలెక్ట్ చేసింది.
కల్కి
ఈ సినిమాకు నాగ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 292 కోట్లు గ్రాస్ ను కొళ్లగొట్టి రికార్డు సృష్టించింది. రాజమౌళి రికార్డ్స్ కాకుండా ఈ సినిమా 100 కోట్ల కు పైగా కల్లెక్ట్ చేసి టాప్ లో నిలిచింది.
సలార్ పార్ట్ వన్
Advertisement
ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ పార్ట్ వన్ 231 కోట్లను కలెక్ట్ చేసింది.
దేవర
ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా 203 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
అలవైకుంఠపురంలో
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా 189 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
వాల్తేరు వీరయ్య
మెగాస్టార్ చిరంజీవి మరియు రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య కి 170 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
బాహుబలి ద బిగినింగ్
రాజమౌళి నిర్మించిన బాహుబలి ద బిగినింగ్ చిత్రం 172 కోట్ల గ్రోస్ ను తెలుగు రాష్ట్రాలలో బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది.
సరిలేరు నీకెవ్వరు
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా 165 కోట్లు కలెక్ట్ చేసింది.
సైరా
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల లో బాక్స్ ఆఫీస్ వద్ద 158 కోట్ల ను కొల్లగొట్టింది
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!