Advertisement
2011 లో విడుదలైన రొమాంటిక్ డ్రామా ఫిలిం మిస్టర్ పర్ఫెక్ట్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అని అందరికీ తెలిసినదే. ఈ సినిమాను దశరథ్ డైరెక్ట్ చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సి పన్ను ప్రధాన పాత్రల లో పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ ను అందించాడు. ఇది ఎంతో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది. పైగా ప్రభాస్ కెరియర్ లోనే మంచి క్లాసిక్ సినిమాగా నిలిచింది.
Advertisement
అయితే ఇంత మంచి సినిమాని చేయకూడదని మొదట్లో అనుకున్నాడట. ఈ విషయాన్ని తాజాగా నిర్మాత దిల్ రాజు చెప్పడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ నేను మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా స్టోరీ గురించి దర్శకుడు దశరథ్ తో డిస్కస్ చేయడం మొదలు పెట్టాను. అదే సమయంలో హీరో ప్రభాస్ మలేషియాలో బిల్లా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దాంతో కథ వినిపించడానికి మేము మలేషియా వెళ్ళాము.
Advertisement
Also read:
మొత్తం సినిమా స్టోరీ విన్నాక ప్రభాస్ కొంచెం డౌట్ వ్యక్తం చేశాడు. ఆయనకు సెకండ్ హాఫ్ నచ్చలేదని స్టోరీ మొత్తం బావుంది అని తెలిపారు. ఆయన అప్పటికే అంగీకరించలేదు. దీంతో స్క్రిప్ట్ మొత్తం బాగా రెడీ చేసి హైదరాబాద్ కి వచ్చిన తర్వాత మళ్ళీ వినిపిస్తామని చెప్పగా కొద్దిరోజులకు ప్రభాస్ మా ఆఫీస్ కు వచ్చాడు. కానీ కొన్ని మార్పులు చేసి పూర్తి స్క్రిప్ట్ ను మేము రెండోసారి చెప్పాకా బాగా నచ్చేసింది. దీంతో ఈ సినిమాకు ఓకే చెప్పాడు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!