Advertisement
హిందూమతంలో అత్యంత ముఖ్యమైన పండుగలో దీపావళి పండుగ కూడా ఒకటి. దీపావళి పండుగను హిందువులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. హిందువులతో పాటుగా బుద్ధులు, సిక్కులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. దీపావళి పండుగను ఆశ్వయుజ బహుళ అమావాస్యనాడు జరుపుకుంటారు. దీపావళి పండుగ అక్టోబర్ 31న వచ్చింది. ఈ పండుగ విశిష్టత ఏంటి..? ఎందుకు దీపాలని వెలిగించాలి వంటి విషయాలని చూద్దాం. రామాయణంలో కూడా దీపావళి గురించి చెప్పబడింది.
Advertisement
Advertisement
పురాణాల ప్రకారం భూదేవి వరాహ స్వామికి అసుర సమయంలో నరకాసురుడు పుడతారు. శ్రీహరి చేతులో చావులేని విధంగా తల్లి చేతిలో మరణం పొందే విధంగా వరాన్ని పొందుతాడు. ఆ గర్వంతో నరకుడు ముల్లోకాలని పీడుస్తాడు. నరకాసురుడు బాధలు భరించలేని దేవతలు మునులు శ్రీహరిని వేడుకుంటారు. వారి మొర ఆలకించిన మహావిష్ణువు కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజెస్తాడు.
దీపావళి నాడు దీపాలని వెలిగించి పండుగని చేసుకుంటారు. అయితే దీపావళి నాడు దీపాలని ఎందుకు వెలిగించాలి అంటే చెడుపై మంచి గెలిచిందని సంకేతంగా దీపావళిని చేసుకుని దీపాలను వెలిగిస్తాము. దీపావళి అంటే దీపాల వరుస. దీపావళిని ఐదు రోజుల పండుగ కూడా చేస్తారు. మట్టి ప్రమిదలు నువ్వుల నూనెతో దీపాలని వెలిగిస్తారు లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నానితో దీపాన్ని నడిపించడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!