Advertisement
అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాల్లో ఏఎన్ఆర్ అవార్డుని మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుక హైదరాబాద్లో తాజాగా సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు వచ్చారు. మెగాస్టార్, అమితాబ్ బచ్చన్ ఈ వేడుకకు విశేష అతిథులుగా హాజరయ్యారు. చిరంజీవికి ఏఎన్ఆర్ అవార్డు ప్రధానం చేశారు. ఈ వేడుకలలో అక్కినేని నాగేశ్వరరావు చివరి మాటల్లో వినిపించారు. అక్కినేని ఫ్యామిలీ గ్రూప్ లో చివరిసారి నాగేశ్వరరావు మాట్లాడిన ఆడియోను స్క్రీన్ ప్లే చేశారు.
Advertisement
ఆయన మాటలు వింటూ ప్రముఖులు అందరు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాను. నా శ్రేయోభిలాషులు అందరూ నా పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో నా ఆరోగ్యం గురించి ఆందోళన పడుతున్నారో నాకు తెలుసు. నా కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు నా ప్రోగ్రెస్ ని చెప్తున్నారని అన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు బాధపడకుండా మిమ్మల్ని సంతోషపరిచేందుకు ప్రయత్నం చేస్తాను.
Advertisement
Also read:
నేను బానే ఉన్నాను రికవరీ అవుతాను అని అన్నారు. అలాగే ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు త్వరలో బయటకు వస్తాను త్వరలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆరోగ్యంగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నా ఆరోగ్యం నా సంతోషం ఆస్తి నాకు దొరికే ఆశీర్వాదాలు అని ప్రగాఢ విశ్వాసం నాకు ఉంది అని అన్నారు. ఈ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!