Advertisement
జూనియర్ ఎన్టీఆర్కి మంచి గ్రేస్ ఉంది. ఆయన చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ నుంచి రీసెంట్ గా వచ్చిన దేవర దాకా ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ని మైంటైన్ చేస్తూ ఉంటారు. డాన్స్లు కానీ డైలాగులు కానీ అద్భుతంగా ఉంటాయి. ఎన్టీఆర్ ,హరికృష్ణ రెండవ భార్య కొడుకు కావడం వలన చిన్నతనంలో నందమూరి ఫ్యామిలీతో కలిసే వాడు కాదు. ఎన్టీఆర్ తన తల్లితోనే ఉంటూ చదువుకుంటూ డాన్స్లు నేర్చుకున్నారు. చిన్నప్పటి నుంచి యాక్టివ్ గా ఉంటున్నారు.
Advertisement
జూనియర్ ఎన్టీఆర్ తో వాళ్ళ తాత సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడడానికి 11 నెలలు సమయం పట్టింది. ఎప్పుడు వెళ్ళినా కూడా ఎన్టీఆర్ మాట్లాడేవాడు కాదని.. ఓ రోజు తనే పిలిపించుకుని తన పేరు కూడా ఎన్టీఆర్ అని పెట్టారని.. చాలా సార్లు చాలా మంది చెప్పారు. చిన్న తనంలో వాళ్ళ తాత అయిన సీనియర్ ఎన్టీఆర్ ఒకసారి మాట్లాడితే బావుంటుంది అని ఎన్టీఆర్ బాధపడ్డారట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తల్లి స్వయంగా ఓ సందర్భంలో చెప్పారు.
Advertisement
Also read:
Also read:
మొత్తానికి సీనియర్ ఎన్టీఆర్ లెగసిని కంటిన్యూ చేస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ లో ఉన్న హీరోలు ఎవరు పెద్దగా రాణించకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ బాధ్యతలు మోస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య తరం ముగిసిపోయింది. ఆయన సినిమాలు చేస్తున్న కూడా తర్వాత కంటిన్యూ చేయడానికి ఒకరు ఉండాలి. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి అంత బాగా ఎవరూ రాణించకపోవడంతో ఎన్టీఆర్ మీద బాధ్యతలు పెట్టడం జరిగింది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!