Advertisement
కార్తీక మాసం ఎంతో ప్రాధాన్యతని కలిగి ఉంటుంది. చాలామంది కార్తీకమాసంలో పరమేశ్వరుడిని ఆరాధిస్తారు ఉదయాన్నే లేచి చన్నీటి స్నానం చేసి శివుడిని ఆరాధించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. కార్తీక మాసంలో కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి వీటిని ఆచరించడం మంచిది. కుజదోషం ఉన్నట్లయితే పెళ్లి ఆలస్యమవుతుంది. అలాంటప్పుడు కార్తీకమాసంలో సుబ్రహ్మణ్య స్తోత్రం చదివితే మంచిది. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్య ఉన్నట్లయితే బైద్యనాథ్ స్తోత్రం, ఆదిత్య హృదయం చదవడం మంచిది. వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నా కుటుంబ కలహాలు ఉన్నా అప్పులు, రాహు గ్రహ దోషాలు ఉన్నా మంగళ చండిక మూత్రం పఠించడం మంచిది.
Advertisement
మంత్రసాధన చేస్తున్న వాళ్ళు దీక్ష తీసుకుని ఉపాసన చేస్తున్న వాళ్ళు రక్తపోటు, షుగర్, చర్మ సమస్యలు ఉన్నా మానసా దేవి స్తోత్రం చదవాలి. కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడే వాళ్ళు, ఎంత కష్టపడుతున్నా ఎదుగుదల లేని వాళ్ళు గరుడ ప్రయోగ మంత్రం చదవాలి. శత్రు బాధలు ఉన్నట్లయితే దుర్గా స్తోత్రం పఠించాలి. కొత్త ఇంటి కోరిక నెరవేరాలంటే మణిద్వీప వర్ణన పారాయణ చేయాలి.
Advertisement
Also read:
పెళ్లి, శుభకార్యాలు జరగాలంటే లలిత సహస్రనామ స్తోత్రం నిత్యం చదవాలి. ఉద్యోగం కోరుకునే వాళ్ళు ఉద్యోగంలో ప్రమోషన్ కోరుకునే వాళ్ళు కనకధార స్తోత్రం పారాయణం చేయాలి. విద్యార్థులు చదువులో విజయాన్ని సాధించడానికి సరస్వతీ, వినాయక, హయగ్రీవ స్తోత్రాలు చదవడం మంచిది. అపజయాల భయాలను తగ్గించి కార్యసిద్ధి చేకూరాలంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. ఇలా కార్తీకమాసంలో వీటిని అనుసరించడం వలన మంచి జరుగుతుంది కార్తీక మాసం అంతా ఉదయం సాయంత్రం తులసి కోట దగ్గర దీపం వెలిగించడం చక్కటి ఫలితం కనబడుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!