Advertisement
నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం సింపుల్ గా జరిగిన విషయం మనకి తెలిసిందే. సమంత, నాగచైతన్య ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత కొన్ని కారణాల వలన విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. సమంత ఒంటరిగా ఉంటున్నారు. అయితే నాగచైతన్య మాత్రం విడాకులు తీసుకున్న తర్వాత శోభిత తో డేటింగ్ చేశారు. ఏకంగా ఆమెని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే వీళ్ళు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వీళ్ళ పెళ్లికి సంబంధించిన పనులు కూడా మొదలైపోయాయి.
Advertisement
శోభిత నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమాన్ని జరిపారు. ఆ ఫోటోలని శోభిత సోషల్ మీడియాలో పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి కాబోయే దంపతులు వచ్చారు. శోభితను ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్లకు చైతు పరిచయం చేశారు.
Advertisement
Also read:
ఈవెంట్ కి వీళ్లిద్దరూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అయితే చైతన్య శోభిత ఒకటవడానికే కారణం అడవి శేషు అని తెలుస్తోంది. రెండు మూవీస్ చేశారు. గూడచారి మూవీ లో నాగార్జున మేనకోడలు సుప్రియ కీలక పాత్రలో కనపడ్డారు ఆ మూవీ షూటింగ్ చూడడానికి వెళ్ళిన చైతన్యకు శోభిత పరిచయం అయింది అది కాస్త ప్రేమగా మారింది ఇలా శోభిత చైతన్యల పెళ్లికి అడవి శేషు కారణం అని తెలుస్తోంది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!