Advertisement
కిరణ్ అబ్బవరం క సినిమా ఫస్ట్ వీకెండ్ లో కలెక్షన్స్ విషయంలో అదరగొట్టింది. మూవీలో మధ్యాహ్నం మూడు గంటలకే చీకటి అవుతుంది. లైఫ్ లో ఇలాంటి గ్రామాలు ఉంటాయా అనే ప్రశ్నకు అవునని సమాధానం వినపడుతోంది. ఇప్పటిదాకా ఏకంగా 19.41 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. తెలంగాణలో ప్రముఖ జిల్లాలోని ఒకటైన పెద్దపల్లి జిల్లాలో కొదురుపాక అనే ఒక గ్రామం క మూవీలో చూపించిన తరహాలో ఉంది.
Advertisement
ఈ ఊరు చుట్టూ కొండలు ఉంటాయి. సాయంత్రం నాలుగు గంటలకి చీకటి అయిపోతుంది. సూర్యోదయం కూడా ఈ గ్రామంలో ఆలస్యంగా జరుగుతుందట. క మూవీ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో కొదురుపాక గ్రామం పేరు విపరీతంగా వినపడుతోంది. ఇది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Advertisement
Also read:
సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ ఇక ఏ స్థాయిలో ఉండబోతాయనేది చూడాలి. క మూవీ తో కిరణ్ బరువు బాధ్యతలు ఇంకా పెరిగాయి. సినిమా సక్సెస్ అవ్వడంతో మరిన్ని కొత్త తరహా ఆలోచలనతో సినిమాలు తెరకెక్కించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో కిరణ్ ఎలాంటి సినిమాలు చేస్తారనేది చూడాలి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!