Advertisement
ఎక్కడ చూసినా ఏపీలో పోలీసులపై పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శల గురించి చర్చ జరుగుతోంది. పిఠాపురం టూర్ లో మహిళలపై అత్యాచారాల విషయంలో పోలీసుల వైఖరిని చూసి పవన్ కళ్యాణ్ రెచ్చిపోయారు. దళిత మహిళ హోం మంత్రి వంగలపూడి అనిత పై విమర్శలు వస్తే సందర్భానుసారం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ క్యాబినెట్ లోనే పోలీసుల్ని టార్గెట్ చేశారు దీంతో ఈ వివాదం ఇక్కడితో ఆగేటట్టు కనబడలేదు.
Advertisement
వైసీపీ నేతలు పోస్టులు పెడుతున్నా కూడా పట్టించుకోరా అని క్యాబినెట్ భేటీలో పోలీసులు తీరు గురించి పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలపై ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోరా అని సీఎం చంద్రబాబు తో పాటుగా మంత్రివర్గ సహచరులని అడిగారు. అలాగే ఆయన పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని జగన్ కి వత్తాసు పలికిన పోలీసులే ఇప్పుడు కీలక పోస్టుల్లో ఉన్నారని ఆయన చెప్పారు.
Advertisement
Also read:
కొంతమంది ఎస్పీలు కి ఫోన్ చేసినా కూడా రియాక్ట్ అవ్వట్లేదు అని కింద స్థాయిలో ఉన్న డిఎస్పీలు, సీఐలపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని అన్నారు. మహిళల పైన పోస్టులు పెడితే ఊరుకోవాలా అని అడిగారు. గత ప్రభుత్వం వలన పోలీసులు అలా తయారయ్యారని చంద్రబాబు నాయుడు చెప్పారు. వాళ్ళందర్నీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!