Advertisement
దర్శకుడు క్రిష్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు, జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జోరుగా సాగుతోంది. ఏ ప్రకటన ఇప్పటికీ రాకపోయినా అనధికారికంగా ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రీతిని పెళ్లి చేసుకోబోతున్నారని.. 16న హైదరాబాద్లో గ్రాండ్ గా రిసెప్షన్ చేసుకోవాలని అనుకుంటున్నారట. 2016లో రమ్య అనే డాక్టర్ తో వివాహం చేసుకున్నారు. ఈ వివాహ మహోత్సవానికి సినీ ప్రముఖులు వచ్చారు.
Advertisement
పెళ్లయిన ఏడాదికి విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. విడాకుల పిటిషన్ ని పరిశీలించిన కోర్టు 2018 లో విడాకులు ఇచ్చింది అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న క్రిష్ జీవితంలోకి గైనకాలజిస్ట్ ప్రీతీ వచ్చారు. వారి పరిచయం ప్రేమగా మారి పెళ్ళి వరకు దారి తీసింది. మాజీ భార్య కాబోయే భార్య ఇద్దరు కూడా డాక్టర్లు కావడం గమనార్హం. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో పరిచయం అవుతుంది. క్రిష్ విషయంలో అలా జరగలేదు.
Advertisement
Also read:
గతంలో పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఇద్దరు కూడా డాక్టర్లు. పవన్ కళ్యాణ్ తో గత మూడు సంవత్సరాలుగా హరిహర వీరమల్లు సినిమా చేస్తూ మధ్యలో తప్పుకున్నారు. అనుష్క సినిమాకి షిఫ్ట్ అయిపోయారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టిన క్రిష్ ఇప్పుడు చివరి దశకు తీసుకువచ్చారు. ఫిబ్రవరిలో కానీ మార్చి లో కానీ సినిమా రాబోతోంది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!