Advertisement
రామ్ గోపాల్ వర్మ కి ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. ఐటీ చట్టం కింద కేసు నమోదయింది. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేసిన ఆయన ఫ్యూచర్ ఏంటి..? జైలు శిక్ష తప్పదా..? అసలు ఏం జరుగుతుంది అనేది చూస్తే.. రాంగోపాల్ వర్మ కాంట్రవర్సీలకి కేరాఫ్ ఎడ్రెస్. బ్లాక్ బస్టర్ సినిమాలతో ఒకప్పుడు మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఇలా మారిపోయారు.
Advertisement
రక్త చరిత్ర మూవీ తర్వాత ఆయన సినిమాలు తీరు కూడా మారిపోయింది. రాజకీయ నాయకుల జీవిత చరిత్ర పేరిట ఇష్టం వచ్చినట్లు కథలతో సినిమాలు తీయడం మొదలుపెట్టారు. అక్కడితో ఆగిపోకుండా తెలుగు రాజకీయాలపై కూడా ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తూ ఉంటారు. అందరినీ రెచ్చగొట్టడానికి చూస్తూ ఉంటారు.
Advertisement
Also read:
శపథం. వ్యూహం సినిమాల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబుని వ్యక్తిగతంగా అవమానించే విధంగా రూపొందించారని ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా ఆయనపై కేసు నమోదు అయింది. ఐటీ చట్టం కింద ఆర్జీవి పై కేసు నమోదు చేశారు. చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి పై కించపరిచే విధంగా పోస్టులు పెట్టారని ఆరోపణల ఆధారంగా పోలీసులు ఐటి చట్టం కింద కేసు నమోదు చేశారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!