Advertisement
కార్తీకమాసంలో పరమేశ్వరుడిని ఆరాధించడం వలన అనేక సమస్యల నుంచి బయటపడొచ్చు. కార్తీకమాసంలో శివుడిని ఆరాధిస్తే కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి. చాలామంది కార్తీక మాసం నువ్వు ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధిస్తారు. నవంబర్ 18న మూడవ సోమవారం. హిందువులు కార్తీకమాసంలో వచ్చే సోమవారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి శివుడుని ఆరాధిస్తారు. ఆరోజు పార్వతీ పరమేశ్వరులు, విష్ణుమూర్తి దంపతుల్ని సాదరంగా ఆహ్వానించాలి. పైగా మూడో సోమవారం చేసే వ్రతాలు పూజలకి ఎంతో మంచి ఫలితం దక్కుతుంది.
Advertisement
మూడో సోమవారం ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.. మూడో సోమవారం చేసే పూజల వలన కోటి పుణ్యఫలాలు కలుగుతాయట. మూడో సోమవారం కైలాసంలో ఆకాశదీపం సంబరాలు జరిగాయని స్కంద పురాణంలో చెప్పబడింది. ఆకాశదీపం దర్శించుకుంటే కోటి పుణ్యాలు కలుగుతాయి. 1000 అశ్వమేధ యాగాల ఫలితం కనబడుతుంది.
Advertisement
Also read:
తెల్లవారుజామున స్నానం చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. రుద్రాభిషేకం చేసుకుంటే కూడా మంచిది. విష్ణు సహస్రనామం పఠించాలి. భక్తితో రుద్రాభిషేకం చేసినా.. విష్ణు సహస్రనామం విన్నా, చదివినా కూడా మంచి ఫలితం ఉంటుంది. తులసి దళాలు, బిల్వపత్రాలతో పూజలు చేస్తే కూడా మంచిది. ధూపదీప నైవేద్యాలను కూడా సమర్పించాలి. కార్తీక సోమవారం ఉపవాసం చేసే వాళ్ళు పాలు, పండ్లు తీసుకోవచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!