Advertisement
నాగార్జునని చూస్తే అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారని అందరూ అంటూ ఉంటారు. ఏజ్ పెరిగినా కూడా ఆయన ముఖంలో కనపడదని.. గ్లామర్ ని సేమ్ మైంటైన్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఎప్పుడు యవ్వనంగా కనబడుతూ ఉంటారు కెరియర్ పరంగా కూడా ఇది వాళ్లకు అవసరం. టాలీవుడ్ లో ఇద్దరు హీరోలు చాలా ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఒకరు నాగార్జున అయితే ఇంకొకరు మహేష్ బాబు. ఎప్పుడూ కూడా హ్యాండ్సమ్ గా కనబడుతూ ఉంటారు వీళ్ళ ఇద్దరి గ్లామర్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. నాగార్జున వయసు 65 ఏళ్లు అయితే ఆయనతో నటించిన చిరంజీవి, బాలకృష్ణ వంటి నటులు చూస్తే వృద్ధాప్యం కనబడుతుంది.
Advertisement
నాగార్జున మాత్రం యంగ్ గా కనపడుతుంటారు. ఫిట్నెస్ మైంటైన్ చేస్తారు. మహేష్ బాబు వయసు కూడా తక్కువ ఏం కాదు. ఐదు పదులకి దగ్గర పడుతోంది. అయినా కూడా అయినా యంగ్ గా వున్నారు. వీళ్ళిద్దరి గ్లామర్ రహస్యం ఏంటి..? తక్కువ వయసు వాళ్లలా కనపడడం వెనుక సీక్రెట్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. అందరూ అనుకుంటున్నట్లు నాగార్జున ఎలాంటి డైట్ ని కూడా ఫాలో అవ్వరు. నచ్చినది కడుపునిండా తినేస్తారట. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఫాలో అవుతారు.
Advertisement
Also read:
ఉదయం వ్యాయామం చేస్తారు దాని వలన రోజంతా యాక్టివ్ గా ఉంటారు. అదనపు క్యాలరీలను కరిగిస్తూ ఉంటారు. రాత్రి 7కి డిన్నర్ చేసేస్తారు. బ్రౌన్ రైస్ ని తీసుకుంటారట. భోజనంలో మూడు ఆకుకూరలని తప్పకుండా తీసుకుంటారట అలాగే చేపలు చికెన్ కూడా ఉంటాయి. స్వీట్ తినకపోతే నాగర్జున కి రాత్రి నిద్ర పట్టదట. అలాగే నెయ్యి కూడా తింటారట మహేష్ బాబు బ్యూటీ సీక్రెట్ వచ్చేసి ఆయన లిమిట్ గా ఆహారాన్ని తీసుకుంటారు. ఇష్టమైనది ఏదైనా తింటారు కానీ లిమిట్ గా మాత్రమే తీసుకుంటారట.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఎదురు చూడండి!