Advertisement
ప్రభుదేవా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చాలా సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కొరియోగ్రాఫర్ గా కూడా పాపులారిటీని సంపాదించుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు హిందీ, తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపును ఆయన తెచ్చుకున్నారు. ఒకప్పుడు ప్రభుదేవా స్టార్ హీరోయిన్ నయనతారతో ప్రేమలో ఉన్నారు. అప్పట్లో వీళ్ళకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ షికార్లు కొట్టాయి. ఇద్దరూ కూడా ఒకరినొకరు మనస్పూర్తిగా ప్రేమించుకున్నారట. చాలాసార్లు వీళ్లు కెమెరా కంట కూడా పడ్డారు.
Advertisement
Advertisement
ఈ జంటని చూసిన ఫ్యాన్స్ చూడముచ్చటైన జంట అవ్వాలని కోరుకున్నారు. ఒకానొక సమయంలో నయనతార ప్రభుదేవా పేరు టాటూ కూడా వేయించుకున్నారు. తర్వాత ఊహించిన విధంగా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. పెళ్లికి రెడీ అయిన వీళ్ళు ఒక్కసారిగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. తర్వాత చాలా కాలం పాటు రిలేషన్ షిప్స్ కి దూరంగా ఉన్నారు.
Also read:
నయనతార హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించారు. తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. సరోగసి ద్వారా ఇద్దరి కవలలకు తల్లి అయ్యారు. నయనతార డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడంతో మరోసారి ఈ విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!